Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతిపిత మహాత్మా గాంధీని రజనీకాంత్‌ కలవడమేంటి? సోషల్ మీడియాలో ఫోటో వైరల్..!

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలికి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. కబాలి వీరాభిమానుల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కోసారి వారి అభిమానం హద్దులు

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2016 (15:53 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలికి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. కబాలి వీరాభిమానుల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కోసారి వారి అభిమానం హద్దులు దాటిపోతోంది. ఇప్పటికే అభిమానుల చేష్టలతో రజనీపై సోషల్ మీడియాలో రకరకాల జోకులు పేలుతున్నాయి. తాజాగా అభిమానులు పోస్ట్ చేసిన ఓ ఫోటో జాతిపిత మహాత్మాగాంధీని కూడా వివాదాల్లోకి లాగే పరిస్థితి ఏర్పడింది. 
 
1948లో మరణించిన జాతిపిత మహాత్మా గాంధీని 1950లో పుట్టిన రజనీకాంత్‌ కలవడమేంటి? నిజమా అనుకుంటున్నారా? నిజమేనండి. జాతిపితతో రజనీ కాంత్ మాట్లాడుతున్నట్లు గల ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్లు ఎదుర్కొంటోంది. మహాత్ముడితో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతున్నట్టున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
ఫోటో షాప్ సాయంతో రజనీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా నుంచి ఓ స్టిల్‌ తీసుకుని దానికి మహాత్ముడిని తగిలించి సోషల్‌ మీడియాలో వదిలేశారు. అంతటితో వదలకుండా స్వాతంత్ర్య ఉద్యమంలో రజనీకాంత్‌కు మహాత్ముడి అభినందనలు అంటూ కూడా కామెంట్స్ పెట్టేశారు. ఇక రజనీ సరికొత్త బాంబులు పేలుతున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments