చెన్నైలో మహేష్ బాబు-మురగదాస్ సినిమా: కష్టపడిపోతున్న ప్రిన్స్
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు-మురగదాస్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సూపర్ హిట్ అవుతుందని భావించిన బ్రహ్మోత్సవం అట్టర్ ప్లాప్ కావడం తో తన నెక్స్ట్ చిత్రంతో అభిమానులను సంతృపి పరచాలని మహేష్ చాలానే
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు-మురగదాస్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సూపర్ హిట్ అవుతుందని భావించిన బ్రహ్మోత్సవం అట్టర్ ప్లాప్ కావడం తో తన నెక్స్ట్ చిత్రంతో అభిమానులను సంతృపి పరచాలని మహేష్ చాలానే కష్టపడుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. చెన్నైలోని ఒక ఫ్లై ఓవర్ క్రింద ఈ షూటింగ్ జరుగుతున్నట్లు చిత్ర ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ తన ట్విట్టర్‌లో తెలిపాడు.
గతంలో తుపాకీ చిత్రానికి వర్క్ చేసిన సంతోష్ శివన్ మళ్లీ మురుగదాస్‌తో మహేష్ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబురు సరసన రకుల్ ప్రీతి సింగ్ నటించగా హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.