Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాట్ బస్టర్ గా మారిన ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ సింగిల్ 'నందనందన

డీవీ
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (15:44 IST)
vijay devarakond, parasuram
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ 'నందనందనా..' ఇన్ స్టంట్ ఛాట్ బస్టర్ అయ్యింది. ఈ పాట మెలొడియస్ గా ఉంటూ మ్యూజిక్ లవర్స్ ఫేవరేట్ సాంగ్ గా మారుతోంది. ఈ పాట సక్సెస్ తో దర్శకుడు పరశురామ్ పెట్ల మ్యూజిక్ టేస్ట్ మరోసారి ప్రూవ్ అవుతోంది. డైరెక్టర్ పరశురామ్ సినిమాల్లో మ్యూజిక్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ సినిమా మూడ్ కు, సందర్భానికి కావాల్సినట్లు ట్యూన్ సెలెక్ట్ చేసుకుంటారు పరశురామ్ పెట్ల. ఎలాంటి పాట ఆ సినిమాకు ఆకర్షణ అవుతూ, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో పర్పెక్ట్ గా గెస్ చేయగలరు పరశురామ్ పెట్ల. 
 
ఆయన గత సినిమాలు "గీత గోవిందం"లో ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే, "సర్కారు వారి పాట"లోని కళావతి..కళావతి పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో చూశాం. ఇప్పుడు "ఫ్యామిలీ స్టార్"లో 'నందనందనా..' పాటతోనూ ఆయన అదే మ్యాజిక్ సాంగ్ సెలెక్షన్ చేశారు. లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సింగర్ సిధ్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాంబోతో పరశురామ్ పెట్ల సూపర్ హిట్ మ్యూజిక్ కాంబో "ఫ్యామిలీ స్టార్" తో రిపీట్ అవుతోంది.
 
"ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాబా పాదాల వద్ద మట్టి కోసమే ఎగబడటం వల్లే తొక్కిసలాట

పుణెలో పెరుగుతున్న జికా వైరస్ కేసులు.. గర్భిణీ స్త్రీలు అలెర్ట్‌

కంగనాకు చెంపదెబ్బ.. కర్ణాటకకు కుల్విందర్ కౌర్ బదిలీ

చంద్రబాబు - రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రిటైర్డ్ టీచర్ ఇంట్లోకి చొరబడ్డ దొంగ.. క్షమించండి.. తిరిగి ఇచ్చేస్తాను..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments