"పుష్ప-2" అప్‌డేట్ : షెకావత్ లుక్‌ను రిలీజ్ చేసిన టీమ్

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (13:00 IST)
సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటిస్తున్న సినిమా 'పుష్ప2'. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా దీని అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అభిమానులైతే ఏకంగా ధర్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ టీమ్‌ ఓ చిన్న అప్‌డేట్‌ ఇచ్చింది. సినిమాలో కీలకపాత్ర పోషిస్తోన్న ఫహాద్ ఫాజిల్‌ లుక్‌ను విడుదల చేసింది.
 
మంగళవారం ఫహాద్ ఫాజిల్‌ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప2'లో ఆయన లుక్‌ను మేకర్స్‌ విడుదల చేసి విషెస్‌ చెప్పారు. దీంతో #pushpa2therule హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ (ఎక్స్‌) ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక 'పుష్ప'లో ఫహాద్ ఫాజిల్‌.. ఎస్పీ భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. 
 
మొదటిభాగంలో నిడివి తక్కువ పాత్ర చేసినప్పటికీ చివరులో మెరిపించారు. క్లైమాక్స్‌లో ఆయన డైలాగులతో థియేటర్లలో ఈలలు వేయించారు. ఇక తాజాగా విడుదల చేసిన లుక్‌లో ఆయన 'పుష్ప'లో ఉన్నట్లే కనిపించారు. 
 
ఇప్పటికే 'పుష్ప2' సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫహాద్ ఫాజిల్‌ ఆ అంచనాలను పెంచేశారు. రెండో భాగంలో భన్వర్‌ సింగ్‌ పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పారు. 
 
హీరోకు ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయన్నారు. ఇక ఈ సీక్వెల్‌లో భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం. 2021లో విడుదలై సూపర్‌హిట్‌ అందుకున్న 'పుష్ప: ది రైజ్‌'కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే 'పుష్ప: ది రూల్‌' (పుష్ప 2). అల్లు అర్జున్‌ సరసన రష్మిక నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏనుగుతో సెల్ఫీ కోసం ప్రయత్నం, తొక్కి చంపేసింది (video)

కస్టడీ కేసు: ఆర్ఆర్ఆర్‌‌ను సస్పెండ్ చేయండి.. సునీల్ కుమార్ ఎక్స్‌లో కామెంట్లు

Ranga Reddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా అగ్రస్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా.. ఎలా?

తెలంగాణ ఎన్నికల్లోనూ జగన్‌ను ఓడించిన చంద్రబాబు.. ఎలాగంటే?

Baba Vanga: 2026లో భూమిపైకి గ్రహాంతరవాసులు వస్తారట.. ఏఐతో ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments