Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్, శ్రీలీల కెమిస్ట్రీ అదుర్స్ : జానీ మాస్టర్ కితాబు

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (16:49 IST)
sreeleela- nitin
నితిన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా - ఆర్డిన‌రీ మ్యాన్’.  రైట‌ర్ - డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 300కి పైగా ఫారిన్ డాన్సర్స్‌తో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో పక్కా మాస్ సాంగ్‌ను హీరో నితిన్, శ్రీలీలపై చిత్రీకరిస్తుండటం విశేషం. ఈ పాట చిత్రీకరణతో ఎంటైర్ షూటింగ్ పూర్తవుతుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 8న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
 
ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల...’, ‘బ్రష్ వేస్కో..’ సాంగ్స్ విడుదలై ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్‌ సైతం అమేజింగ్‌గా ఉందంటూ అప్రిషియేషన్స్ అందుకుంది.  మూవీలో యూనిక్‌గా ఉన్న నితిన్ క్యారక్టరైజేషన్, మూవీ కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకోనుంది. నితిన్ ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్‌లో కనిపించి తనదైన కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేయించనున్నారు.
 
మ్యూజికల్ జీనియ‌స్ హేరిస్ జయ‌రాజ్ సంగీత సారథ్యం వహిస్తుండగా..యువరాజ్.జె, అర్థర్ ఎ.విలన్స్, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై ఎన్.సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments