Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రినా కైఫ్ కిడ్నాప్ అయ్యిందట.. డ్రైవర్ చేతిలో బందీ అయ్యిందట.. నిజమేనా?

బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ కిడ్నాప్‌కు గురైందట. డ్రైవర్ చేతిలో బందీ అయ్యిందా అని తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి. సెలెబ్రిటీల డ్రైవర్లకు అన్నీ విషయాలు తెలిసిపోతాయ్. కత్రీనా విషయంలో అదే జరిగింద

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2016 (15:15 IST)
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ కిడ్నాప్‌కు గురైందట. డ్రైవర్ చేతిలో బందీ అయ్యిందా అని తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి. సెలెబ్రిటీల డ్రైవర్లకు అన్నీ విషయాలు తెలిసిపోతాయ్. కత్రీనా విషయంలో అదే జరిగింది. కానీ కత్రీనా కిడ్నాప్‌కు గురి కాలేదు. సెలెబ్రిటీల గురించిన రహస్యాలను వారి డ్రైవర్లే ముందు తెలుసుకుంటారు. సెక్సీ భామ కత్రినాకు కూడా ఈ విషయం లేటుగా తెలిసొచ్చింది. 
 
రణబీర్‌తో తన ప్రేమాయణం, రొమాన్స్, విదేశీ టూర్లు, సహజీవనం, చివరకు బ్రేక్ అప్ వంటి విషయాలన్నీ ఆమె డ్రైవర్ ద్వారానే బయట ప్రపంచానికి తెలిసిందని సమాచారం. ఇదంతా ఎలా జరుగుతుందో అటు కత్రినాకు, ఇటు రణబీర్‌కు మొత్తంగా సినీ ప్రేమికులకు అర్థం కాని రహస్యంగానే ఉండిపోయింది. అయితే, తన డ్రైవరే ఈ రహస్యాలన్నింటినీ మీడియాకు చేరవేశాడని కత్రినాకు తెలిసిందట. ఈ విషయం తెలిసి తీవ్ర కోపానికి గురైనా ఇక చేసేది లేక మిన్నకుండిపోయిందట. 
 
తన సీక్రెట్ వ్యవహారాలు అన్నీ డ్రైవర్ ద్వారా మీడియాకు తెలుస్తున్నాయని వాటిని మీడియా వాళ్ళకు చేరవేసి బాగానే సొమ్ము చేసుకున్నాడని కత్రీనా లేటుగా  పసిగట్టింది. కానీ కత్రీనా డ్రైవర్‌ని శిక్షించకుండా ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను మరోసారి ఇది రిపీట్ అయితే సహించేది లేదని తేల్చి చెప్పేసిందట. డ్రైవర్‌ని మాత్రమే కాకుండా తన స్టాఫ్‌ని కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట కత్రీనా. రణబీర్ కపూర్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ భామ ఇప్పుడు రణబీర్‌కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం