Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ భారీ అంచనాలు.. రీ షూట్‌కు ప్లాన్ చేస్తున్న రాజమౌళి

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (14:32 IST)
బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్‌పై భారీ అంచనాలున్నాయి. దానికి తోడు అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్ వంటి చారిత్రక పురుషుల నేపథ్యం ఉన్న చిత్రం కావడం..ఎన్టీఆర్,రాంచరణ్ కలయికలో వస్తుండటంతో.. సినిమాపై ఇప్పటినుంచే తెగ క్యురియాసిటీ నెలకొంది. 
 
ఆర్ఆర్ఆర్‌కి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి మరో లీక్ బయటకొచ్చింది. టైటిల్‌కి సంబంధించిన ఆ లీక్‌పై ఫిలింనగర్ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
 
రాజమౌళి,రాంచరణ్,ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వస్తుండటంతో 'ఆర్ఆర్ఆఆర్' అన్న వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్‌కి మ్యాచ్ అయ్యేలా 'రామ రౌద్ర రుషితం' అనే టైటిల్‌ను రాజమౌళి సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
కానీ తారక్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆర్ ఆర్ ఆర్' గురించి మాత్రం అప్ డేట్ వెలువడలేదు. ఇది తారక్, రామ్ చరణ్ అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది. అయితే, దీనికి సంబంధించి ఓ ఆసక్తికర సమాచారం అందుతోంది. 
 
ఈ చిత్రానికి సంబంధించిన రషెస్‌ను చూసిన రాజమౌళి నిరాశకు గురయ్యారని... కొన్ని సీన్లు అనుకున్న విధంగా రాలేదని చెబుతున్నారు. దీంతో, ఆ సన్నివేశాలను మళ్లీ షూట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. ఇప్పటికే చిత్ర నిర్మాతతో ఈ విషయంపై చర్చించారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

Pulasa: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే- 800 గ్రాముల పులస రూ.22వేలు పలికింది

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments