Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేచ్ వ‌ర్క్ మిన‌హా ఆర్‌.ఆర్‌.ఆర్‌. పూర్తి

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (16:11 IST)
RRR-still
ఎన్‌.టి.ఆర్‌., రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న `రౌద్రం రణం రుధిరం` (ఆర్‌.ఆర్‌.ఆర్‌.) సినిమా దాదాపు షూటింగ్ పూర్త‌యింద‌ని చిత్ర యూనిట్ సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. కొంత పేచ్ వ‌ర్క్ వుంద‌నీ, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లో మిగిలిన వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని వెల్ల‌డించింది. పాన్ ఇండియా మూవీగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా వివ‌రాల‌ను ఆయ‌న త‌న సోష‌ల్‌మీడియా సిబ్బందితోనే పంచుకుంటున్నారు. అవి ఆటోమేటిక్‌గా పోస్ట్ అయిపోతున్నాయి.
 
ఇక త్వ‌ర‌లో ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్ల‌ను వెల్ల‌డిస్తామ‌ని ఆ పోస్ట్‌లో పేర్కొంది. అంటే ఇప్ప‌టికే కొన్ని సినిమా విడుద‌ల తేదీలు ప్ర‌క‌టించేశారు. కానీ ఆర్‌.ఆర్‌.ఆర్‌. విడుద‌ల ఇంకా సందిగ్థంలో వుంది. ప్ర‌స్తుతం దేశంలో ప‌రిస్థితులు బాగోలేవు క‌నుక క‌రోనా మూడోవేవ్ కూడా వ‌స్తే పూర్తిగా ఆర్‌.ఆర్‌.ఆర్‌. విడుద‌ల మారిపోయే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇటీవల ఉక్రెయిన్ లో చేసిన చివరి షెడ్యూల్ తో ఈ సినిమా మొత్తం పూర్తయింది. మిగిలిన పేచ్‌వ‌ర్క్ హైద‌రాబాద్‌లోనే షూట్ చేయ‌నున్నారు. అధునాత‌న సాంకేతిక‌త‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డికానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Medical Student: ఒత్తిడిని తట్టుకోలేక పురుగుల మందు తాగి వైద్య విద్యార్థి ఆత్మహత్య

TTD: రూ.6 కోట్ల రూపాయల చెక్కును టీటీడీకి అందించిన చెన్నై భక్తుడు

చంద్రబాబుకు గవర్నర్‌ పదవి.. పవన్ సీఎం కాబోతున్నారా? నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం..?

Maha Kumba Mela: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే?

గోమూత్రం తాగండి..జ్వరాన్ని తరిమికొట్టండి..వి. కామకోటి.. ఎవరాయన..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments