Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

దేవీ
గురువారం, 5 జూన్ 2025 (18:30 IST)
Mohan Babu
మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న చిత్రం కన్నప్ప విడుదలకు సిద్ధమైంది. రకరకాల ప్రమోషన్లు మాగ్జిమమ్ చేస్తున్నారు. అమెరికాకు కూడా వెళ్లి అక్కడ పబ్లిసిటీ చేశారు. ఒకవైపు ఇంత ప్రచారం చేస్తుంటే మరోవైపు కన్నప్పకు చెందిన హార్డ్ డిస్క్ పోయిందనే వార్త కూడా వచ్చింది. అది మంచు మనోజ్ కు చెందిన వారిపనేఅంటూ విష్ణు ప్రకటించాడు. ఇంకోవైపు కన్నప్ప అనేది మంచు విష్ణు కెరీర్ లో మైలురాయిగా మోహన్ బాబు స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఇంతచేసినా ఈ సినిమాపై ఎందుకనో హైప్ రాలేదనే టాక్ నెలకొంది.
 
దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా హీరో విష్ణు మంచు ఈ సినిమాలో కన్నప్పగా కనిపిస్తాడు. ఇక ఈ సినిమాను కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ గ్రాండ్‌గా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన కన్నప్ప కథను మోహన్ బాబు రివీల్ చేశారు.
 
తన కళ్లను శివుడికి ఇచ్చి తిన్నడు ‘కన్నప్ప’గా చరిత్రలో నిలిచిపోయాడు. తనకు మాత్రం తన తల్లిదండ్రులు నిజమైన కన్నప్పగా మోహన్ బాబు అభివర్ణించారు. తన బిడ్డల ఆకలి తెలుసుకుని తీర్చే ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప అని మోహన్ బాబు అన్నారు. ఇక తన తల్లి లక్ష్మమ్మ పుట్టుకతో రెండు చెవులు వినించవని.. ఆమెకు ఐదు మంది సంతానం అని.. తమ ఊరికి వెళ్లాలంటే బస్సు దిగి 7 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేదని.. తన ఐదు మంది సంతానంను ఎత్తుకుని ఆమె తమ ఊరికి తీసుకెళ్లేందుకు ఎంతో కష్టపడేదని తెలియజేశారు. సోషల్ మీడియా దీనిపై పాజిటివ్ లుక్ కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: చంద్రబాబు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలతో హాట్‌లైన్ కనెక్షన్‌లో వున్నారు.. జగన్

అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ.. ఎక్కడినుంచైనా గెలుస్తా! (video)

stray dogs ఆ 3 లక్షల వీధి కుక్కల్ని చంపేస్తారా? బోరుమని ఏడ్చిన నటి సదా (video)

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)

వెర్రిమొర్రి పిందెల్లారా, అతి భారీ వర్షం కురిస్తే అమరావతి మాత్రమే కాదు, ముంబై, హైదరాబాద్ కూడా జలమయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments