Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారి కాంబినేష‌న్‌లో చిన్న పాత్రైనా చేయాల‌నుకున్నా - హీరోయిన్ సిద్దీ ఇధ్నానీ

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (16:28 IST)
Siddi Idhnani
తెలుగులో నేను చేసిన కొన్ని సినిమాలో వర్కవుట్ కాలేదు. బ్రేక్ కోసం చూస్తున్నాను. నా పొటెన్షియల్ గురించి నాకు తెలుసు. అయితే... ఛాన్స్ రావాలి కదా! గౌతమ్ మీనన్ సినిమాలో హీరోయిన్‌గా ఇంకా ఎవరూ సెలెక్ట్ కాలేదని తెలిసి ప్రయత్నించాను. ఆడిషన్స్‌కు వెళ్ళాను. ఉదయం నాలుగు గంటల ఫ్లైట్‌కు చెన్నై వెళ్లాను. ఆడిషన్ తర్వాత సాయంత్రం శింబు గారితో ఒక సీన్ షూట్ చేశారు. అప్పటికి నేను సెలెక్ట్ అయ్యానని అనుకోలేదు. గౌతమ్ మీనన్ గారిని అడిగితే... 'నువ్వు సెలెక్ట్ అయ్యావ్' అని చెప్పారు. అప్పటికి నాకు కథ తెలియదు. నా పాత్ర తెలియదు- అని ది లైఫ్ ఆఫ్ ముత్తు గురించి హీరోయిన్ సిద్దీ ఇధ్నానీ వెల్ల‌డించారు.
 
శింబు కథానాయకుడిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన హ్యాట్రిక్ సినిమా 'వెందు తనిందదు కాడు'. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'గా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. తెలుగులో ఈ నెల 17న (శనివారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంలో 15న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సిద్దీ ఇధ్నానీతో ఇంటర్వ్యూ.
 
సినిమా విడుదలకు కొన్ని గంటలే సమయం ఉంది. నెర్వస్‌గా ఏమైనా ఉందా?
కొంచెం ఉంటుంది కదండీ! సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఎటు చూసినా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. 
 
:శింబు సరసన... అదీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో... కెరీర్‌లో ఎర్లీగా ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించారా?
 గౌతమ్ మీనన్ సినిమాలు చూశా. ఆయన తీసిన చిత్రాల్లో 'ఏ మాయ చేసావె', 'చెలి' నా ఫేవరెట్ ఫిల్మ్స్. ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక నాలో బలంగా ఉంది. అయితే, ఇటువంటి పెద్ద సినిమా చేసే అవకాశం వస్తుందని అనుకోలేదు. ఈ సినిమా చేసేటప్పుడు మోస్ట్ లక్కీయెస్ట్ గాళ్ అనుకున్నాను.  
 
సెట్స్‌లో గౌతమ్ మీనన్ ఎలా ఉంటారు?
చాలా కామ్‌గా ఉంటారు. ఆయనకు ఏం తీయాలో క్లారిటీగా తెలుసు. ఆయన విజన్ క్లియర్‌గా ఉంటుంది. ఆయనతో పని చేయడం అంటే నటీనటులకు అదృష్టమే. 
 
సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
నా పాత్ర పేరు పావని. బొంబాయిలో పెరిగిన తమిళమ్మాయి అని చెప్పవచ్చు. కామ్‌గా ఉంటుంది. సెన్సిబుల్ అమ్మాయి అనొచ్చు. 
 
 నిజ జీవితంలో మీ పాత్రకు, సినిమాలో మీరు చేసిన పాత్రకు సారూప్యతలు ఏమైనా ఉన్నాయా?
 మెచ్యూరిటీ పరంగా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' చేశాక... ఆ పాత్ర తాలూకూ స్వభావం నాతో అలా ఉంది. రిచ్ లేదా పూర్ అనేది పక్కన పెడితే... గౌతమ్ మీనన్ సినిమాల్లో హీరోయిన్ రోల్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఆ పాత్రల్లో ఒక అందం, ఒక ఆకర్షణ, ఒక ప్రత్యేకత ఉంటాయి. నాతో పాటు వాటిని ఉంచుకున్నాను.
 
శింబు, గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ ఫిల్మ్ ఇది. 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' ప్రచార చిత్రాలు చూస్తే... యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అనిపిస్తోంది. గత సినిమాలకు, దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇందులో హీరోయిన్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఉంది?
మీరు చెప్పింది నిజమే! ఇంతకు ముందు శింబు, గౌతమ్ మీనన్ చేసిన సినిమాలు రొమాంటిక్ ఫిల్మ్స్. 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్‌ గ్యాంగ్‌స్ట‌ర్‌ ఫిల్మ్. సెట్స్‌లో వైబ్ ఎలా ఉండేదంటే... ఒక ఫైర్ ఉండేది. సినిమాలో సింగిల్ టేక్ షాట్స్ చాలా ఉన్నాయి. ఐదు నిమిషాల యాక్షన్ సీన్‌ను సింగిల్ టేక్‌లో చేశారు. రొమాంటిక్ సీన్‌నూ సింగిల్ టేక్‌లో చేశాం. యాక్షన్ పరంగా సినిమా కొత్తగా ఉంటుంది. నా క్యారెక్టర్ విషయానికి వస్తే... గౌతమ్ మీనన్ సినిమాలో హీరోయిన్ రోల్ అలా వచ్చి వెళ్ళదు కదా! ముత్తు జీవితంలో సంతోషం పావని. ఆ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. 
 
 సినిమాలో ఒక సీన్ చేసిన తర్వాత కూడా మీరు హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యానని అనుకోలేదట! నిజమేనా?
ముందు అనుకోలేదు. శింబు, గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ చేస్తున్నారని మాత్రమే తెలుసు.  ఆ కాంబినేషన్‌లో సినిమా అంటే నో ఎలా చెబుతా? చిన్న క్యారెక్టర్ అయినా సరే చేయాలని డిసైడ్ అయ్యా. నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత గౌతమ్ మీనన్ గారు కథ, పాత్ర వివరించారు. విన్న వెంటనే ప్రేమలో పడ్డాను.  
 
గౌతమ్ మీనన్ సినిమాలో సెలెక్ట్ అయ్యాననే విషయం ముందుగా ఎవరికి చెప్పారు?
 నిజం చెప్పాలంటే... రెండు రోజుల వరకూ ఎవరికీ చెప్పలేదు. ఈ న్యూస్ నిజమని నమ్మడానికి నాకు టైమ్ పట్టింది (నవ్వులు). నేను షూటింగ్ స్టార్ట్ చేసిన రెండు రోజుల తర్వాత ఒక రోజు షూట్ క్యాన్సిల్ చేశారు. నాకు చాలా భయం వేసింది. నా బదులు వేరే ఎవరినైనా సెలెక్ట్ చేశారనుకున్నాను. గౌతమ్ మీనన్ గారికి ఫోన్ చేసి 'నేను సినిమాలో ఉన్నానా? ఓకేనా?' అని అడిగా. 'నువ్వు వర్రీ అవ్వొద్దు. సినిమాలో ఉన్నావ్' అని చెప్పారు. ఆ తర్వాత అమ్మానాన్నలకు చెప్పాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నాకు సినిమాలు అంటే ఎంత ప్రేమ ఉందో తెలుసు కాబట్టి... పెద్ద అవకాశం రావడంతో హ్యాపీ ఫీలయ్యారు. 
 
రెహమాన్ పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మీ సినిమాకు సంగీతం అందించడం ఎలా ఉంది?
 ఏఆర్ రెహమాన్ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ తరం అంతా ఆయన సంగీతం విని పెరిగారు. ఈ సినిమాకు సోల్‌ఫుల్‌ మ్యూజిక్ ఇచ్చారు. నా స్నేహితుల్లో కొందరికి తమిళం, తెలుగు రాదు. వాళ్ళు 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' పాటలు విని కన్నీళ్లు పెట్టుకున్నారు. భాషలకు అతీతంగా ఆయన సంగీతం ప్రేక్షకులకు చేరుతోంది. రెండు మూడు రోజుల క్రితం రెహమాన్ గారు ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో థంబ్‌నైల్‌ నా ఇమేజ్ ఉంది. రెహమాన్ గారి ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌లో నా ఫోటో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా నా కల నిజమైన క్షణాలు అవి. గౌతమ్ మీనన్, రెహమాన్, శింబు... ఒక్క సినిమాతో ముగ్గురితో పని చేయాలనే కల నిజమైంది. సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. 
 
శింబుతో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌?
ప్రతి ఒక్కరికీ ఆయన స్టార్‌డ‌మ్‌, ఫ్యాన్ బేస్ గురించి తెలుసు. నాకు శింబు అంటే ఇష్టమే. అయితే... ఈ సినిమా తర్వాత ఆయన ఫ్యాన్ అయిపోయా. సెట్స్‌లో ఆయన నటన చూశాక ఎవరైనా ఫ్యాన్ అవుతారు. ఆయన నటన మనల్ని కట్టిపడేస్తుంది. శింబు బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్, ఎక్స్‌ప్రెష‌న్స్‌... ప్రతిదీ సూపర్. ముత్తు పాత్రలో ఆయన జీవించారు.  
 
తమిళం 15న... తెలుగులో 17న సినిమా విడుదలవుతోంది? ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు
చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. అందరికీ పెద్ద హాయ్. వాళ్ళకు నేను చెప్పేది ఒక్కటే... 'కలలు కనండి. నిజం చేసుకోండి. ఫైట్ చేయండి. ఏదీ అసాధ్యం కాదు'. ఒక సమయంలో అసాధ్యం అనుకున్నది నేడు నా జీవితంలో సాధ్యం అయ్యింది. గౌతమ్ మీనన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. తెలుగులో శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ విడుదల చేయడం సంతోషంగా ఉంది. మేం చాలా కష్టపడి సినిమా చేశాం. శింబు బెస్ట్ పెర్ఫార్మన్స్ 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' అని చెప్పొచ్చు. గౌతమ్ మీనన్  వచ్చే 20 ఏళ్ళు ఎటువంటి సినిమాలు తీయబోతున్నారనేదానికి ఉదాహరణ ఈ సినిమా. నేను సినిమా చూశా. గౌతమ్ మీనన్ అద్భుతంగా తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...

మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?

#DuvvadaMaduriSrinivasLove: ప్రేమ గుడ్డిది కాదు.. ప్రేమను కళ్లారా చూడవచ్చు.. (video)

ప్రియాంక గాంధీపై ‘జాతీయ జనసేన పార్టీ’ పోటీ.. ఎవరీ దుగ్గిరాల నాగేశ్వరరావు

పవన్ 'తుఫాన్' ఎఫెక్ట్: మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకుంటున్న Mahayuti కూటమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments