Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌ `ఎంత మంచివాడ‌వురా` మాస్ సాంగ్ ఎలా ఉంది..?

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (20:54 IST)
నందమూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా ‘శతమానం భవతి‘ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత‌మంచివాడ‌వురా`. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది.
 
శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఎంత‌మంచివాడ‌వురా సినిమాలో రెండో సాంగ్ `జాత‌రో జాత‌ర‌..`ను చిత్ర యూనిట్ రెడ్ ఎఫ్‌.ఎంలో విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్, సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు.
 
“జాత‌రో జాత‌రో నేనొస్తే జాత‌రో ప‌రువాల మోత మోగ‌నీరో
పూత‌రో పూత‌రో బంగారు పూత‌రో నా మేని మెరుపు చూసుకోరో
 ఊరోళ్ల కుర్రోళ్ల ఊర‌క చెప్పున‌మ్మో అస‌లైన పండ‌గేదో 
నిప్పులోన ప‌డ్డాకే నిగ్గు తేలున‌మ్మో సిసలైన పుత్త‌డేదో….“
 
అంటూ ఎంత‌మంచివాడ‌వురా సినిమాలో రెండో సాంగ్ `జాత‌రో జాత‌ర‌ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, న‌టాషా దోషి మ‌ధ్య సాగే మాస్ బీట్ సాంగ్‌ను శుక్ర‌వారం రెడ్ ఎఫ్.ఎంలో విడుద‌ల చేశారు. 
 
ఇప్ప‌టికే విడుద‌ల చేసిన `అవునో తెలియ‌దు కాదో తెలియ‌దు ..` అనే మెలోడీ సాంగ్‌కు, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చాయి. ఇప్పుడు విడుద‌ల చేసిన మాస్ బీట్‌కు కూడా అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తోంది. శ్రీమ‌ణి సాహిత్యాన్ని అందించిన ఈ పాట‌ను బిగ్‌బాస్ 3 విన్న‌ర్, సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌, సాహితి చాగంటి ఆల‌పించారు.
 
ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న విడుదల చేయ‌నున్నారు. మ‌రి.. ఎంత మంచి వాడ‌వురా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments