Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఠాగూర్
ఆదివారం, 30 మార్చి 2025 (16:18 IST)
తాను నటించిన కొత్త చిత్రం 'ఎంపురాన్‌'లోని కొన్ని సన్నేవేశాను తన ప్రియమైన వారిని బాధించాయని, అందుకు క్షమాపణలు చెపుతున్నట్టు ఆ చిత్రం హీరో మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం "ఎల్2 ఎంపురాన్". ఈ నెల 27వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించి, కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అయితే, ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదమయ్యాయి. 
 
గత 2002లో గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. అల్లర్ల సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హత్య చేయడం, కొంతకాలానికి అతడే రాజకీయాల్లో అడుగుపెట్టడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ సన్నివేశాలను చాలామంది తప్పుబడుతున్నారు. ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ, సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
దీంత మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పారు. రాజకీయ సామాజిక అంశాలు కొన్ని 'ఎంపురాన్‌' సినిమాలో భాగమయ్యాయని, తనకు ప్రియమైన కొందరిని అవి బాధించాయని తెలిపారు. ఏ రాజకీయ ఉద్యమాన్ని, భావజాలాన్ని, మతాన్నితన సినిమాలు కించపరచకుండా చూడటం ఒక నటుడుగా తన బాధ్యత అని పేర్కొన్నారు. కాబట్టి తన తరపున, తన చిత్రంబృందం తరపున క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. 
 
ఆ సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించినట్టు వివరించారు. గత నాలుగు దశాబ్దాలుగా మీలో ఒకడిగా ఉంటున్నానని, మీ ప్రేమ, నమ్మకమే తన బలమని అభిమానులను ఉద్దేశించి మోహన్ లాల్ పోస్ట్ చేశారు. కాగా, ఈ చిత్రాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిలకించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments