Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి ముందే తల్లిగా మారుతున్న హీరోయిన్లు...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (13:47 IST)
పెళ్ళికి ముందే తల్లికావడం ఇపుడు ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. పైగా, ఇలా కావడాన్ని చాలా మంది హీరోయిన్లు ఓ ప్రిస్టేజ్‌గా తీసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ఏక్తా కపూర్ ఇలాంటి పనే చేసింది. ఆమె పెళ్లికి ముందే తల్లి అయింది. అయితే, తనకు నచ్చిన వ్యక్తితో కలిసి మాత్రం కాదు లెండి.. సరోగసి విధానం ద్వారా ఆమె తల్లి అయింది. ఈమె వయస్సు 41 యేళ్లు. 
 
నిజానికి ఏక్తా కపూర్ గతంలో ఓ ప్రకటన చేసింది. తాను పెళ్లి చేసుకోనని, కానీ తల్లిని అవుతానని చెప్పింది. అలా ప్రకటించినట్టుగానే ఆమె తల్లి అయింది. ఇది బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. పెద్దల సినిమాలు, సీరియ‌ల్స్ తీయ‌డంలో ఆరితేరిపోయింది ఏక్తాక‌పూర్... ఇప్పుడు ఈమె త‌ల్లైన వార్త కూడా చాలా వేగంగానే వైరల్ అయింది. 
 
ఇదిలావుంటే, ఈమె కంటే ముందే పెళ్లి కాకుండా త‌ల్లైన వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. గ‌తంతో తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి మంచు ల‌క్ష్మి కూడా స‌రోగ‌సి నుంచి త‌ల్లైంది. అయితే ఈమెకు పెళ్లైంది కూడా. ఇక శ్రీ‌దేవి ముందు త‌ల్లి అయిన త‌ర్వాతే పెళ్లి చేసుకుంది. గ‌ర్భిణిగా ఉన్న‌పుడు బోనీ క‌పూర్‌ను పెళ్లి చేసుకుంది. శృతిహాసన్ జన్మించిన తర్వాత కమల్ హాసన్‌ను నటి సారిక పెళ్లాడిన విషయం తెల్సిందే. 
 
ఇక టాలీవుడ్ విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత రేణూ దేశాయ్ పెళ్లి చేసుకుంది. అలాగే, సుశ్మితా సేన్ కూడా పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఈమె ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. మొత్తంమీద హీరోయిన్లు పెళ్లి కాకుండానే తల్లులు కావడం ఓ ట్రెండ్‌గా భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments