Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆద్యంతం న‌వ్విస్తూ సూపర్ థ్రిల్‌కు కలిగించే 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'

'స్వామిరారా', 'కార్తికేయ‌', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో యూత్‌లో యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్‌గా ఎదిగిన హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో వ

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (12:14 IST)
'స్వామిరారా', 'కార్తికేయ‌', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో యూత్‌లో యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్‌గా ఎదిగిన హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో వ‌స్తున్న చిత్రం 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'. ఈ చిత్రంలో నిఖిల్‌కి జంట‌గా '21F ఫేం' హెబ్బాప‌టేల్, త‌మిళంలో 'అట్ట‌క‌త్తి', 'ముందాసిప‌త్తి', 'ఎధిర్ నీచ‌ల్' లాంటి వ‌ర‌స సూప‌ర్‌హిట్స్‌లో నటించిన నందిత‌ స్వేతలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 
 
ఇలాంటి క్రేజీ ప్రోజెక్ట్‌ని 'టైగ‌ర్' ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిస్తున్నారు. మేఘ‌న ఆర్ట్స్ నిర్మాణంలో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఢిఫ‌రెంట్ లవ్ స్టోరీని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మెద‌టి లుక్ టీజ‌ర్‌ని ఈనెల 15న చిత్ర యూనిట్ హీరో నిఖిల్‌, హీరోయిన్ నందిత శ్వేత‌, ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్‌లు రిలీజ్ చేశారు. చిత్రాన్ని న‌వంబ‌ర్ 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చెప్పారు. 
 
ఈసందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ "మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఢిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఏక్క‌డికి పోతావు చిన్న‌వాడా చిత్రాన్ని చేశాము. మా చిత్రం దాదాపు 8 నెల‌ల నుండి షూటింగ్ కార్య‌క్ర‌మాలు చేశాము. షూటింగ్ కంప్లీట్ అయ్యాక‌నే ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేద్దామ‌ని యూనిట్ అంతా అనుకున్నాం. ఇప్ప‌డు మా టీజ‌ర్‌ని ఎటువంటి ఆడంబ‌రాం లేకుండా విడుదల చేశాము. చూసిని ప్ర‌తి ఓక్క‌రూ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంద‌ని చెప్తున్నారు. 
 
ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వ‌టం చాలా ఆనందంగా వుంది. న‌వంబ‌ర్ 11న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాము. అక్టోబ‌ర్ చివ‌రివారంలో లేదా న‌వంబ‌ర్ మెద‌టివారంలో శేఖ‌ర్ చంద్ర అందించిన ఆడియో విడుద‌ల చేస్తాము. ఆద్యంతం న‌వ్వించ‌మే కాకుండా సూపర్ థ్రిల్ వుంటుంది. హెబ్బాప‌టేల్, నందితా శ్వేత ఎక్స‌లెంట్‌గా చేశారు. ఇంకా వెన్నెల కిషోర్ చాలా బాగా న‌వ్వించాడు. నా గ‌త చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది." అని అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. యువకుడితో ఆమెకు నెల రోజులే పరిచయం..

పవన్ ప్రభంజనం : ఇది మహారాష్ట్రనేనా? జాతీయ పాలిటిక్స్‌లోనూ గబ్బర్ సింగ్..? (video)

గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తానని గాడ్సే శిష్యుడు చెబితే మనం ఒప్పుకుంటామా?

Kasthuri arrest: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు, కస్తూరి అరెస్ట్

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments