Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కన్నుమూత

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2015 (19:34 IST)
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు(81) ఆదివారం స్వర్గస్తులయ్యారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఆదివారంనాడు పరిస్థితి విషమించి కన్నుమూశారు. 1934, ఏప్రిల్‌ 24న ఆయన జన్మించిన ఏడిద... సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సీతాకోకచిలుక, స్వాతిముత్యం, ఆపద్బాంధవుడు వంటి అత్యుత్తమ చిత్రాలను తీసిన నిర్మాత. 'శంకరాభరణం' చిత్రానికి జాతీయ ఉత్తమచిత్రం అవార్డు లభించింది. 
 
అలాగే సాగరసంగమం, సితార చిత్రాలకు జాతీయ అవార్డులు సాధించాయి. ఏడిద లేని లోటు టాలీవుడ్ ఇండస్ట్రీలో పూడ్చలేనిదని పలువురు సినీ నిర్మాతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా సోమవారంనాడు టోలీచౌకిలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో ఏడిద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments