Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీ లాండరింగ్ కేసు.. మోహన్ లాల్‌కు నోటీసులు

Webdunia
శనివారం, 14 మే 2022 (19:48 IST)
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మనీ లాండరింగ్ వ్యవహారంతో చిక్కుల్లో పడ్డారు. మనీ లాండరింగ్ వ్యవహారం కింద ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం అందుతోంది. వ‌చ్చే వారం విచార‌ణ‌కు రావాలంటూ ఈడీ అధికారులు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. విచార‌ణ కోసం కొచ్చిలోని ఈడీ కార్యాల‌యానికి రావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. 
 
కేర‌ళ‌కు చెందిన వ్యాపారి మాన్స‌న్ మాన్క‌ల్‌తో క‌లిసి మోహ‌న్ లాల్ మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్టు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో మాన్స‌న్‌ను గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లోనే కేర‌ళ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుపై దృష్టి సారించిన ఈడీ.. మాన్స‌న్‌తో క‌లిసి మోహ‌న్ లాల్ కూడా మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్టు భావిస్తోంది.
 
ఈ విష‌యం నిర్ధార‌ణ కోస‌మే ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి మోహన్ లాల్‌‌కు ఈడీ నోటీసులు పంపించందనే వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మోహన్ లాల్ ప్రస్తుతం బిగ్ బాస్ షోతో పాటు, తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments