Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరపైకి డ్రగ్స్ కేసు.. 12 మంది సెలెబ్రిటీస్‌కు ED నోటీసులు

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (18:17 IST)
సరిగ్గా నాలుగేళ్లకి ముందు టాలీవుడ్‌ని అతలాకుతలం చేసిన డ్రగ్స్ కేసు మళ్లీ ఇప్పుడు తెరమీదకి వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈసారి ఏకంగా 12 మంది టాలీవుడ్ సెలబ్రిటీస్‌కి డ్రగ్స్ ట్రాఫికింగ్‌తో సంబంధం ఉందని అని అనుమానం వ్యక్తం చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఆగస్టు 31న ఈడి టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ ఇన్వెస్టిగేషన్ లో జాయిన్ అవమని పిలుపునిచ్చింది. 
 
తాజాగా ఇప్పుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ గా తప్పుకుని ప్రొడక్షన్లో సెటిలైన ఛార్మి కౌర్, నవదీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులకు పిలుపునిచ్చింది. అంతేకాక రానా దగ్గుబాటి కూడా డ్రగ్స్ తో సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
 
ఇక ఈ సెలబ్రిటీల పై ఇన్వెస్టిగేషన్ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 22 వరకు జరుగుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ఇన్వెస్టిగేషన్లను చేపట్టామని ఇప్పటికే ఆర్డర్ వేసింది ఈడి. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సెలబ్రిటీలకి వ్యతిరేకంగా ఆధారాలు లేకపోవడం వల్ల పూర్తి చేయలేకపోయింది. 
 
ఈ నేపథ్యంలో మాట్లాడుతూ ఒక అధికారి ఇప్పటికే 11 చార్జిషీట్లు ఫైల్ అయ్యాయని, ఇన్వెస్టిగేషన్ కోసం ఎనిమిది మంది ఇంచార్జి లను నియమించామని, కానీ వారంతా లోవర్ లెవెల్ ట్రాఫికర్లు మాత్రమే అని అన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6న రకుల్, సెప్టెంబర్ 8న రానా దగ్గుబాటి, సెప్టెంబర్ 9న రవి తేజ మరియు తదితరులు ఇన్వెస్టిగేషన్లో పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

YS Jagan : జగన్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న బాలిక.. సెల్ఫీ తీసుకున్న వైకాపా చీఫ్(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments