Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌య‌స్సు బ‌ట్టి తిండి తింటాః సునీల్ శెట్టి

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (16:28 IST)
Sunil Shetty
బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి మంచు విష్ణు `మోసగాళ్లు` చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ మార్చి 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సునీల్ శెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.
మోసగాళ్లు సినిమా చేయాలని ఎందుకు అనిపించింది?
ఓ సినిమా చేయాలంటే స్క్రిప్ట్ బాగా ఉండాలి. చేసే దర్శకుడు, అదిరిపోయే కథ, హాలీవుడ్ స్థాయిలో ఉన్న స్టాండర్డ్స్ అన్నీ కలిసి ఈ సినిమాను ఓకే చేసేలా చేశాయి. సినిమాను చూసే విధానం, దాన్ని తెరపైనే తెరకెక్కించేదానికి ఎంతో తేడా ఉంటుంది. అక్కాతమ్ముడు కలిసి ఇలా స్కాం చేయడమనేది నన్ను ఆకట్టుకుంది. వారిని పట్టుకోవడమే నా పాత్ర. కానీ వారిద్దరూ ఎంతో తెలివిగా సిస్టం నుంచి తప్పించుకుంటూ ఉంటారు. యదార్థ ఘటనల ఆధారంగా తీసే సినిమాలు వర్కవుట్ అవుతుంటాయి. జనాలు వాటినే ఇష్టపడుతున్నారు. ఇందులో ఎంతో వినోదం కూడా ఉంది. అవన్నీ కూడా నన్ను ఈ సినిమాను ఒప్పుకునేలా చేశాయ్.
 
తెలుగు భాషతో మీకు ఏదైనా సమస్యలు వచ్చాయా?
నాకు తెలిసి తెలుగు భాషను మాట్లాడటమే కష్టం కానీ అర్థం చేసుకోవడం సులభమే. ప్రతీ పదం అర్థం తెలుసుకోవడం కష్టం. కానీ నాకు అద్భుతమై టీం దొరికడంతో అది సులభమైంది. మామూలుగా అయితే ఈ మూవీ మొదటగా ఇంగ్లీష్‌లోనే షూట్ చేశాం. ఆ తరువాతే తెలుగులో తీశాం. హిందీ వర్షెన్‌ను కూడా చేశాం. అలా వేర్వేరు భాషల్లో చేయడం చాలా కష్టతరమైన పని. కానీ నా వంత ప్రయత్నం నేను చేశాను.
 
వయసు కనపడకుండా ఇలా ఎలా ఉంటున్నారు? మీ సీక్రెట్స్ ఏంటి?
నేను ఏం తింటున్నాను.. ఎంత తినాలే అనే దానిపై నాకంటూ ఓ అవగాహన ఉంది. నా వయసు మీద ఓ దృష్టి పెట్టాలి.. అలానే నా ఫిట్‌నెస్ మీదా శ్రద్ద పెట్టాలి. అందుకే నేను తినే తిండి మీద చాలా శ్రద్దగా ఉంటాను. ఇక యోగా, వర్కవుట్లు ప్రతీరోజూ కచ్చితంగా చేస్తాను.
 
 
మోసగాళ్లు సినిమా చేస్తున్న సమయంలో ఏమైనా మెమోరీస్ ఉన్నాయా?
మోసగాళ్లు టీంతో పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతీది అనుకున్న సమయంలో అయిపోతుంది. అదే దక్షిణాది పరిశ్రమ గొప్పదనం. తినడం, ప్యాకప్ చెప్పడం, రిహార్సల్స్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా అన్నీ టైంకి జరుగుతూ ఉంటాయి. హైద్రాబాద్‌లో అడుగుపెట్టినప్పుడే నాకు ఓ రకమైన మంచి అనుభూతి కలిగింది. నేను డైరెక్టర్ జెఫ్రీ, విష్ణు, కాజల్‌తో ఎప్పుడూ కూడా పని చేయలేదు. ఈ సినిమాను వాళ్లు కొత్తగా ఆలోచించారు.. సరికొత్తగా తెరకెక్కించారు. వారు మా అనుభవాన్ని ఉపయోగించుకున్నారు.. మేం వారి క్రియేటివిటీని వాడుకున్నాం. వారు సీన్ బై సీన్ వెళ్తుంటారు.
 
విష్ణుతో మీ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏమైనా పంచుకున్నారా?
విష్ణు కొత్త తరానికి చెందిన వారు. వారికే ఇంకా బాగా తెలుస్తాయ్. నేను పాత కాలపు మనిషిని. సినిమాలో మా ఇద్దరి మధ్య ఎన్నో యాక్షన్ సీక్వెన్స్‌లున్నాయ్. ప్రతీ యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుంది. పైగా యాక్షన్ సీక్వెన్స్‌లంటే ఎంతో శ్రద్దగా ఉండాలి. టైమింగ్‌తో చేయాలి లేదంటే గాయాలు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ మా సెట్‌లో అలాంటివేమీ జరగలేదు అదే మా అదృష్టం.
 
గని సినిమా గురించి చెప్పండి?
గని అద్భుతంగా ఉండబోతోంది.. వరుణ్ తేజ్ నిజంగా బ్రిల్లియంట్. మళ్లీ ఓ కొత్త దర్శకుడు. ఈ సినిమా కోసం మళ్లీ శరీరాకృతిని మార్చాలి.. నేను ఎంతో ఆత్రుగా ఎదురుచూస్తున్నాను

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments