Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కళ్యాణ్ రామ్ బర్త్‌డే : కొత్త మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Webdunia
సోమవారం, 5 జులై 2021 (09:53 IST)
టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ తన పుట్టినరోజు వేడుకలను జూలై 5వ తేదీ సోమవారం జరుపుకుంటున్నారు. ఈ బర్త్‌డేను పురస్కరించుకుని ఆయన నటించే కొత్త చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ న్యూ మూవీలో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రను పోషిస్తుండగా, అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ పతాకంపై ఈ మూవీ నిర్మితమవుతుంది. 
 
క‌ల్యాణ్ రామ్ 21వ సినిమాగా వ‌స్తున్న ఈ మూవీ టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను సోమవారం విడుదల చేశారు. క‌ల్యాణ్ రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 
 
పీరియాడిక్ వైబ్‌లా క‌నిపిస్తున్న ప్రీ లుక్ ఒక‌టి షేర్ చేశారు మేక‌ర్స్. పంచెక‌ట్టులో బ్లాక్ షూష్ వేసుకున్న ఓ వ్య‌క్తి చేతిలో గొడుగు ప‌ట్టుకుని రైల్వే ట్రాక్‌‌పై నిల‌బ‌డ‌టం ప్రీ లుక్‌లో క‌నిపిస్తోంది.
 
పంచెక‌ట్టులో ఉన్న‌ది క‌ల్యాణ్ రామ్ అని అర్థ‌మ‌వుతోంది. చ‌రిత్ర‌లో రాయ‌ని చాఫ్ట‌ర్ అంటూ రిలీజ్ చేసిన ఈ లుక్‌ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. ఇండియ‌న్ హిస్ట‌రీని ట‌చ్ చేస్తూ ఈ చిత్ర కథాంశం ఉండ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇంకా టైటిల్ ఖ‌రారు కాని ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. డైరెక్ట‌ర్, న‌టీన‌టుల, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డి కానున్నాయి. 
 
మరోవైపు, తన సొంత నిర్మాణ సంస్థ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నిర్మించే కొత్త చిత్రం పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి బింబీసారా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది చరిత్ర పురాణ గాథకు సంబంధించిన కథగా ఉంది. ఈ చిత్రానికి వశిష్ట్ దర్శకత్వం వహించగా, ఇప్పటికే 70 శాతానికిపైగా షూటింగ్‌ను పూర్తిచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments