Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోల వెనుక ఎద్దులను పరిగెత్తించి.. వారి ఫీలింగ్ చూడాలి : రామ్‌గోపాల్‌ వర్మ

నచ్చినా, నచ్చకున్నా జనాగ్రహానికి భయపడో, మరే కారణం వల్లనో తమిళనాడులోని 'జల్లికట్టు'ను సపోర్ట్‌ చేస్తున్నారు కొందరు సినిమా హీరోలు, హీరోయిన్లు, ఇతర ప్రముఖులు. అలాంటి వాళ్ల మధ్య ధైర్యంగా ఆ ఆచారం గురించి ప

Webdunia
ఆదివారం, 22 జనవరి 2017 (08:49 IST)
నచ్చినా, నచ్చకున్నా జనాగ్రహానికి భయపడో, మరే కారణం వల్లనో తమిళనాడులోని 'జల్లికట్టు'ను సపోర్ట్‌ చేస్తున్నారు కొందరు సినిమా హీరోలు, హీరోయిన్లు, ఇతర ప్రముఖులు. అలాంటి వాళ్ల మధ్య ధైర్యంగా ఆ ఆచారం గురించి ప్రశ్నించాడు 'ట్వీట్‌స్టార్‌' రామ్‌గోపాల్‌ వర్మ. 'మూగ జీవాలను హింసించడం తమిళ సాంప్రదాయమని అంగీకరించేవారు.. అమాయక ప్రజలను చంపడం ఆల్‌ఖైదా సాంప్రదాయమని ఒప్పుకుని సరిపెట్టకుంటారా?' అని ప్రశ్నించాడు. 
 
అలాగే 'జల్లికట్టు'ను సమర్థిస్తున్న సినిమా వాళ్లను కూడా రామ్‌గోపాల్‌ వర్మ కడిగిపారేశాడు. 'శశికళ, జయలలితలను పూజించే ప్రజలు జల్లికట్టును సమర్థించడం బాగానే ఉంది. విపరీతమైన వ్యక్తిపూజ, జంతు బలి ఆదిమ జాతి తెగల్లోనే ఉంటాయి.
 
సినిమాల్లో కాకులను, కుక్కలను హింసించినట్టు చూపించినా ప్రభుత్వం ఒప్పుకోదు. కానీ, సాంప్రదాయం పేరుతో ఎద్దులను హింసించడానికి పర్మిషన్‌ ఇచ్చేసింది. ఇక, సినిమావాళ్లంతా జల్లికట్టును సమర్థిస్తున్నారు. అలా సమర్థిస్తున్న వారందరి వెంటకనీసం వంద ఎద్దులను పరిగెత్తించాలి. అప్పుడు వారి ఫీలింగ్‌ ఏమిటో చెప్పమనాల'ని వర్మ ట్వీట్లు చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments