Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుల్కర్ సల్మాన్ సీతా రామం ఫస్ట్ సింగిల్ లవ్లీ మెలోడీ విడుదల

Webdunia
సోమవారం, 9 మే 2022 (13:25 IST)
Dulquer Salman, Mrinalini Thakur
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా యుద్ధం నేపధ్యంలో ఓ అందమైన ప్రేమకథ '' సీతా రామం' చిత్రం రూపుదిద్దుకుంటుంది. వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా పతాకం పై అశ్వినీదత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రం నుంచి ఈ రోజు ఫస్ట్ సింగిల్ 'ఓ సీతా- హే రామా' పాట విడుదల చేశారు. ఈ పాట  సంగీత ప్రేమికుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం సంపాదించుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ లవ్లీ మోలోడీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ప్లజంట్ ట్రాక్ గా నిలిచింది.
 
 ఓ.. సీతా.. వదలనిక తోడౌతా..  రోజంతా వెలుగులిడు నీడవుతా.. నుదుట తిలకమై వాలుత. అంటూ అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటని మరో స్థాయికి తీసుకెళ్లింది. పాటలో వినిపించిన ఈ సాహిత్యం '' సీతా రామం' ప్రేమకథలో మాధుర్యాన్ని అందంగా చెప్పాయి.
 
ఎస్పీ చరణ్,  రమ్య బెహరా పాటని అద్భుతంగా ఆలపించారు. వింటేజ్ ఇళయరాజా-ఎస్పీబీ  మ్యూజికల్ మోమోరీస్ ని ఈ పాట గుర్తుకు తెచ్చింది. ఆడియన్స్ లూప్ మోడ్ లో పెట్టుకొని మళ్ళీమళ్ళీ వినే చార్ట్ బస్టర్ మెలోడీగా ఈ పాట ఆకట్టుకుంది.
 
పాటలో కనిపించిన విజువల్స్ గ్రాండ్ గా వున్నాయి. దుల్కర్, మృణాల్ మధ్య కెమిస్ట్రీ బ్యుటిఫుల్ గా వుంది. పాటలో మ్యూజిక్ మేకింగ్ కూడా చూపించారు. పెద్ద వయోలిన్ ట్రూప్ తో గ్రాండ్ సింఫనీ ఆర్గనైజ్ చేసి ఈ పాటని రికార్డ్ చేశారు. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో నిర్మాతలు ప్రత్యేక ద్రుష్టి పెట్టి అద్భుతమైన ఆల్బమ్ ని ప్రేక్షకులకు వినిపించే లక్ష్యంతో వున్నారని ఫస్ట్ సింగల్ రికార్డింగ్ చూస్తే అర్ధమౌతుంది.
ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న అఫ్రీన్‌ అనే కీలకమైన పాత్ర పోషిస్తుంది.
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments