Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుల్క‌ర్ స‌ల్మాన్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జంట‌గా పరిణ‌యం

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (17:06 IST)
Dulquer and Kalyani
‘ప‌రిణయం’ చిత్రం సెప్టెంబర్ 24న ‘ఆహా’లో ప్రీమియ‌ర్ కానుంది. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో సురేశ్ గోపి, శోభ‌న,ఊర్వ‌శి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అనూప్ స‌త్య‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసి మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన ‘వ‌ర‌ణే అవ‌శ్య‌ముంద్’  చిత్రాన్ని ఆహా పరిణయం పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుల చేశారు. గుండెను తాకేలా ఫీల్ గుడ్ మూమెంట్స్‌తో ఎంట‌ర్‌టైనింగ్‌గా ‘ప‌రిణ‌యం’ మూవీ రూపొందింద‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. 
 
సినిమాలో ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా ఈ ట్రైల‌ర్‌లో చూడొచ్చు. సింగిల్ మ‌ద‌ర్ నీనా, ఆమె కుమార్తె నికిత‌, వారి స‌మీపంలో ఉండే ఇరుగుపొరుగువాళ్లు, సామాజిక‌మైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న‌ మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్‌, సంతోషంగా ఉండే అదృష్ణ‌వంతుడైన యువ‌కుడు అత‌నికి ఫ్రాడ్ అనే నిక్ నేమ్ కూడా ఉంటుంది. అత‌ను సింగిల్ మ‌ద‌ర్‌, ఆమె కుమార్తె ఉండే ప‌క్క అపార్ట్‌మెంట్‌లోనే ఉంటుంటాడు. ‘ప‌రిణ‌యం’  అనేది పెద్దలు కుదిర్చిన వివాహాలు, సింగిల్ పేరెంట్ అయిన మ‌హిళ ఎదుర్కొనే స‌మ‌స్య‌లు, ఆమె మ‌ధ్య వ‌య‌సులో ప్రేమ‌ను కోరుకోవ‌డం, ఇలా మ‌న చుట్టూ చాలా మంది జీవితాల్లో ఉండే అనేక స‌మ‌స్య‌ల‌ను గురించి తేలికైన పంథాలో తెలియ‌జేస్తూ సాగే సినిమా. మ‌ధ్య త‌ర‌గ‌తి నేప‌థ్యంలో సినిమాను తెర‌కెక్కించారు. మ‌నుషుల మ‌ధ్య ఉండే బంధాలు, అనుబంధాల‌ను ఏదో బ‌లంగా చెబుతున్న‌ట్లు కాకుండా తేలిక‌గా,  కొత్త కోణంలో, సెన్సిబుల్‌గా తెలియచేసేలా రూపొందించారు.  
 
ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా న‌టించిన దుల్క‌ర్ స‌ల్మాన్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే. అలాగే ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సురేశ్ గోపి, శోభ‌న‌, ఊర్వ‌శి, కేపీఏసీ ల‌లిత త‌దిత‌రులలో స‌మ‌తూకంగా చేసిన బ్యాలెన్స్‌డ్ పెర్ఫామెన్‌సెస్ ఆకట్టుకుంటాయి. దీంతో పాటు న‌టీన‌టుల మ‌ధ్య సాగే రొమాన్స్‌, ఆక‌ట్టుకునే హాస్యంతో పాటు ఆల్ఫోన్స్ జోసెస్ చ‌క్క‌టి సంగీతం మెప్పిస్తుంది. ముఖేష్ ముర‌ళీధ‌రన్ అందించిన విజువ‌ల్స్‌, టోబీ జాన్ ఎడిటింగ్ ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన సినిమా అనుభ‌వాన్ని అందిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?

'ఫెంగాల్' : దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments