Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరణ్ అబ్బవరం క సినిమా మలయాళం థియేట్రికల్ రైట్స్ తీసుకున్న దుల్కర్ సల్మాన్

డీవీ
సోమవారం, 9 సెప్టెంబరు 2024 (15:47 IST)
Kiran Abbavaram
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ "క" సినిమా అనౌన్స్ మెంట్ నుంచే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ తో పాటు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. "క" సినిమా గురించి వస్తున్న పాజిటివ్ టాక్ ఇతర చిత్ర పరిశ్రమల దృష్టినీ ఆకర్షిస్తోంది.
 
తాజాగా "క" సినిమా సినిమా మలయాళ థియేట్రికల్ రైట్స్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది. మలయాళంలో "క" సినిమాను వరల్డ్ వైడ్ గా ఈ సంస్థ థియేట్రికల్ రిలీజ్ చేయనుంది. "క" సినిమా ఫస్ట్ లుక్, టీజర్ చూసిన దుల్కర్ సల్మాన్ ఇంప్రెస్ అయి మలయాళ వెర్షన్ తమ వేఫరర్ ఫిలింస్ సంస్థలో విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. స్ట్రాంగ్ కంటెంట్ తో "క" సినిమా ఈ క్రేజ్ ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రైట్స్ ను నిర్మాత వంశీ నందిపాటి తీసుకున్నారు. ఇదే క్రమంలో త్వరలోనే తమిళ, కన్నడతో పాటు ఇతర భాషల బిజినెస్ క్లోజ్ కానుంది.
 
"క" సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments