Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్కీ భాస్కర్ గా దుల్కర్‌ సల్మాన్‌

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (15:19 IST)
Lucky Bhaskar look
దుల్కర్ సల్మాన్ వివిధ భాషల్లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మలయాళ యంగ్ స్టార్ పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత తరంలోని ఉత్తమ నటులలో ఒకరిగా ఖ్యాతిని పొందారు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా పాపులర్ స్టార్. తన గత చిత్రం 'సీతారామం'తో బ్లాక్ బస్టర్ అందుకున్న దుల్కర్ సల్మాన్, తన తదుపరి పాన్-ఇండియా చిత్రం కోసం దర్శకుడు వెంకీ అట్లూరితో చేస్తున్నారు.
 
ధనుష్ తో చేసిన సార్(వాతి)తో వెంకీ అట్లూరి బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రం సామాజిక బాధ్యత కలిగిన దర్శకుడిగా ఆయన ఖ్యాతిని పెంచింది. సార్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న వెంకీ అట్లూరి, ఇప్పుడు తన ప్రతిభను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్తున్నారు. ఆయన తదుపరి సినిమా కోసం సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ సార్(వాతి)ని కూడా వారే నిర్మించడం విశేషం. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. దుల్కర్ సల్మాన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వెంకీ అట్లూరి మరో విభిన్న కథాంశంతో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.
 
'నమ్మశక్యంకాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ'గా ఈ చిత్రం రూపొందుతోందని ప్రకటన సందర్భంగా చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇప్పుడు ఈ చిత్రానికి 'లక్కీ భాస్కర్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఇది సినిమా ప్రేమికులకు థియేటర్‌లలో గొప్ప అనుభూతిని కలిగించే చిత్రమవుతుందని మేకర్స్ పేర్కొన్నారు.
 
జాతీయ అవార్డు గ్రహీత, సార్(వాతి)కి చార్ట్‌బస్టర్ సంగీతం అందించిన జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చేసిందా?

భర్తే అత్యాచారం చేస్తే నేరమా? కాదా? - పార్లమెంటులోనే నిర్ణయిస్తామని కేంద్రం కోర్టుకు ఎందుకు చెప్పింది

లడ్డూ కల్తీ అయిందా.. ఎక్కడ? సిట్ ఎందుకు.. బిట్ ఎందుకు? జగన్ ప్రశ్న (Video)

హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట

తెలంగాణ సీఎం రేవంతన్నకు బహిరంగ లేఖ రాసిన కేవీపీ ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

తర్వాతి కథనం
Show comments