Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దృశ్యం' మూవీ డైరెక్టర్ నిషికాంత్ ఆరోగ్యం విషమం!!

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (08:50 IST)
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ ఆరోగ్యం విషమంగా మారింది. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతూ వచ్చారు. ఈ సమస్యలు మరింతగా ముదిరిపోవడంతో హైదరాబాద్ నగరం, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య వర్గాల సమాచారం. 
 
'డోంబివాలీ ఫాస్ట్' అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి, అదే సినిమాకు జాతీయ అవార్డు అందుకున్నారు. గత కొన్ని రోజులుగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 
 
మలయాళ సూపర్ హిట్ మూవీ 'దృశ్యం' హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించింది నిషికాంతే. 'ముంబై మేరీ జాన్', 'ఫోర్స్',  'లై భారీ' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ మూవీ 'హవా ఆనే దే', మరాఠీ సినిమా 'సాచ్య ఆట ఘరాట్' సినిమాల్లో నటించారు కూడా. బాలీవుడ్ నటుడు జాన్‌ అబ్రహాం నటించిన 'రాకీ హ్యాండ్సమ్‌' సినిమాలో విలన్‌ గానూ నటించి మెప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments