డ్రింకర్ సాయి నుంచి డ్రింక్సు, డ్రింక్సు, డ్రింక్సు. సాంగ్ రిలీజ్

డీవీ
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (17:39 IST)
Drinker Sai. Song
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు "డ్రింకర్ సాయి" సినిమా నుంచి 'డ్రింక్సు, డ్రింక్సు, డ్రింక్సు..' లిరికల్ సాంగ్ రిలీజ్  చేశారు.
 
'డ్రింక్సు, డ్రింక్సు, డ్రింక్సు..' లిరికల్ సాంగ్ ను శ్రీ వసంత్ మంచి బీట్ తో కంపోజ్ చేయగా, చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్ గా పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే - ' లక్ష్మీ వైన్సు, దుర్గ వైన్సు, సాయి బాబ వైన్సు, శ్రీనివాస వైన్సు, బాలాజీ వైన్సు, భార్గవి వైన్సు, శ్రీకృష్ణ వైన్సు, శివగణేశ వైన్సు, దేవుళ్లే చెబుతుంటే వెల్ కమ్సు, మీరెందుకు పెడతారు టోల్ గేట్సు, డ్రింక్సు, డ్రింక్సు, డ్రింక్సు..స్వర్గానికి మనకు లింక్సు,'డ్రింక్సు, డ్రింక్సు, డ్రింక్సు..మన బాడీకి పెట్రోల్ బంక్సు, 'డ్రింక్సు, డ్రింక్సు, డ్రింక్సు..కనిపెట్టినవాడికి థ్యాంక్సు...' అంటూ సాగుతుందీ పాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments