Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్‌2, గేమ్‌ ఛేంజర్‌ రెండు సినిమాలపై సందిగ్థత!

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (11:09 IST)
Kamal-charan
ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్‌ సినిమాలు రెండిటిపై అటు కమల్‌ హాసన్‌, ఇటు రామ్‌చరణ్‌ అభిమానుల్లో సందిగ్థత నెలకొంది. ఇప్పటికే వారు తమ సోషల్‌ మీడియాలో పలు పోస్ట్‌లు పెట్టారు. చరణ్‌కు సంబంధించిన ఓ పోర్టల్‌లో శంకర్‌ దుస్థితి పునరావృతం అవుతోందని బాధపడుతున్నారు. ఇండియన్‌2 సినిమా ప్రమోషన్‌ ఆడియో ఈవెంట్‌ ఏడాదికిందటే జరిగింది. మరలా దాని అప్‌డేట్‌ ఏమిటో తెలియలేదు. మధ్యలో శంకర్‌కూ, కమల్‌కు ఏవో విభేదాలున్నట్లు వచ్చాయి. ఆ తర్వాత కమిట్‌ అయిపోయారు అని చెప్పారు. 
 
ఇక రామ్‌చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ విషయంలోనూ ఎందుకు ఆలస్యం అవుతుందనేది అర్థంకాకుండా పోయింది. నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు శంకర్‌ మధ్య ఏవో చిన్నపాటి పొరపాచ్చాలున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దిల్‌రాజు ఓ సందర్భంగా అంతా బాగానే వుంది. శంకర్‌ కొంచెం బిజీ అయినట్లు  వెల్లడించారు. ఇప్పుడు అభిమానులు చరణ్‌ సినిమాముందుగా విడుదల చేయండి అంటూ పలు ట్వీట్లు శంకర్‌ కు తెలియజేసినట్లు సమాచారం. భారతీయుడు2 (ఇండియన్‌2) సమకాలీన రాజకీయాలపై తీస్తున్న సినిమా. ఇక గేమ్‌ ఛేంజర్‌ కూడా దాదాపు అటువంటిదే. ఇందులో చరణ్‌ రెండు పాత్రలు పోషిస్తున్నాడు. అందులో ఒకటి నిజంగా గేమ్‌ చేజంర్‌లా వుంటుందని చిత్రయూనిట్‌ చెబుతోంది. త్యరలో లేటెస్ట్ న్యూస్ రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments