Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబుల్ ఇస్మార్ట్‌ 100 రోజుల్లో మార్చి 8న థియేటర్స్ లో విడుదల

Webdunia
బుధవారం, 29 నవంబరు 2023 (13:23 IST)
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని వారి మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.  ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్ లో ప్రధాన తారాగణం పాల్గొంటుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
 
సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. 'డబుల్ ఇస్మార్ట్‌' మార్చి 8, 2024న మహా శివరాత్రికి ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీని స్పష్టం చేయడానికి మేకర్స్ వందరోజుల కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
 
 పోస్టర్  రామ్ పోతినేనిని ట్రెండీ హెయిర్‌డో,  షేడ్స్ ధరించి సూపర్ స్టైలిష్ ఇంకా మ్యాసీవ్ అవతార్‌లో ప్రజెంట్ చేసింది. షర్టు, జీన్స్‌తో జాకెట్ ధరించి, తుపాకీని పట్టుకొని టెర్రిఫిక్ గా కనిపించారు రామ్. అతని వెనుక చాలా వెపన్స్ ఉన్నాయి. సినిమాలో మనం చూడబోతున్న మాస్, యాక్షన్ వైబ్ ని పోస్టర్ సూచిస్తుంది.
 
ఇస్మార్ట్ శంకర్‌తో సహా పలు చిత్రాలలో పూరీ జగన్నాధ్‌కు సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ 'డబుల్ ఇస్మార్ట్‌'కు సంగీతం అందిస్తున్నారు.
 
రామ్,పూరి జగన్నాధ్రీ డెడ్లీ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.
 
సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో డబుల్‌ ఇస్మార్ట్‌ రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు మేకర్స్.
\డబుల్ ఇస్మార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాలంటీర్లను ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నాం: మంత్రి పార్థసారధి

హనుమ విహారికి నారా లోకేష్ అండ.. ఆంధ్రా రంజీ జట్టులో స్థానం?

2011 రైల్ రోకో కేసు.. కేసీఆర్‌కు ఊరట.. వచ్చేనెల 18కి వాయిదా

AP TET పరీక్షలు విడుదల..

ఐదుగురిని లాగేస్తే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా వుండదన్నారు కదా... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments