Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాను నమ్మే దేవుడిని - తన అత్మవిశ్వాసాన్ని తిట్టొద్దు.. రష్మి హచ్చరిక

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (14:10 IST)
తాను నమ్మే దేవుడిని, తన ఆత్మవిశ్వాసాన్ని తిట్టొద్దని బుల్లితెర యాంకర్, హీరోయిన్ రష్మి గౌతమ్ హెచ్చరించారు. సనాతన ధర్మానికి మద్దతుగా గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేశారు. దీంతో ఆమెను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ఆమె స్పందించారు. నాస్తికులను తాను గౌరవిస్తున్నప్పుడు, తాను సనాతన ధర్మాన్ని నమ్ముతున్నానని చెబితే ఎందుకు విమర్శిస్తున్నారంటూ ప్రశ్నించారు. తనకు ఎదురైన విషయాలను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
"నేను ఈ ఒక్క పోస్ట్‌ను షేర్ చేయగానే నన్ను అంతా టార్గెట్ చేసుకున్నారు. తమకు వాక్ స్వాతంత్ర్యం ఉందంటూ చాలా మంది దీనిపై వాదిస్తున్నారు. కానీ, నేను నమ్ముతున్న ధర్మం వైపు ఉంటానని చెప్పినందుకు నేను విమర్శలు ఎదుర్కోవాలా? సిగ్గుపడాలా? నేను మీ నాస్తికత్వాన్ని ప్రశ్నించడం లేదు. అలాంటపుడు నా విశ్వాసాలను మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు. కొందరు కులాల సమస్యలను ప్రస్తావిస్తున్నారు. అసలు ఏ మతం సరైనదో చెప్పండి. తీవ్రవాదులు, అతివాదులు లేని మతం ఏదో చెప్పండి. కేవలం మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయని, ఆ కుటుంబాన్ని మార్చుకోలేరు కదా. అన్ని మతాలకు మూల సూత్రం ఒకటే ఉంది. అదే బ్రతకండి. బ్రతనివ్వండి. అంతే తప్ప నా దేవుడిని నా విశ్వాసాన్ని తిట్టొద్దు అని ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో హోలీ వేడుక చేసుకోవడానికి ట్రావెల్ గైడ్

Ceiling fan: పరీక్షలు రాస్తుండగా వున్నట్టుండి.. సీలింగ్ ఫ్యాన్ ఊడిపడితే..?

వీవింగ్ ది ఫ్యూచర్-హ్యాండ్లూమ్ కొలోక్వియం సదస్సు నిర్వహణ

హోలీ పండుగ: మార్చి 14న మద్యం దుకాణాలు బంద్.. రంగులు అలా చల్లారో తాట తీస్తాం..

College student: కళాశాల విద్యార్థినిపై 16 నెలల పాటు ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments