Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్ వర్మ సర్వే: పవన్‌కు నెగటివ్ టాక్.. పవన్ చేస్తున్నదేమిటి?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (14:42 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఈ మధ్య పొసగట్లేదు. వివాదాస్పద అంశాలపై కామెంట్స్ చేయడం వర్మ అలవాటు. ఒకవేళ ఏదీ దొరక్కపోతే వివాదాల్ని వర్మ సృష్టిస్తాడు. తన గురించి నలుగురూ మాట్లాడుకోవడానికో తన మూవీ ప్రచారానికో ఏ టాపిక్‌నైనా వర్మ వాడేసుకుంటాడు. 
 
తాజాగా కులాల కాన్సెప్ట్‌తో సినిమా తీయడం ప్రారంభించినప్పటి నుంచి పవన్ గురించి వర్మ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ గురించి ఓ సర్వే కూడా చేయించాడు. 'జనసేన స్పీచ్ తర్వాత పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరుస్తున్నాడా?' అన్నదే వర్మ సర్వే టైటిల్. ఈ ఆన్ లైన్ ఓటింగ్ సర్వేకి స్పందన బాగానే వచ్చింది. ఏకంగా 9400మంది పాల్గొన్న ఈ సర్వేలో.. 64శాతం మంది పవన్ నిరుత్సాహపరిచాడనే స్పష్టం చేశారు.
 
ఇంతకుముందు తుని కాపు గర్జన తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించినపుడు కూడా వర్మ ఇలాంటి వ్యతిరేక వ్యాఖ్యలే చేశాడు. అసలు పవన్ ఏం మాట్లాడాడో  పవన్‌కైనా అర్ధమయిందా అని ప్రశ్నించి.. ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైయ్యాడు. ఈ సర్వే నిజం కాదంటే.. అభ్యంతరం చెప్తే.. వారు నిజంగానే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కాదని రామ్ గోపాల్ వర్మ అంటున్నాడు.. మరి పవన్ ఏమంటాడో?

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

కుర్‌కురే ప్యాకెట్ తీసుకురాలేదని భర్తకు షాకిచ్చిన భార్య.. విడాకుల కోసం దరఖాస్తు!!

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ - బలగాల మొహరింపు.. టీడీపీ - వైకాపా నేతల గృహనిర్బంధం!!

పులివర్తి నానిపై హత్యాయత్నం : పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు!!

కుర్ కురే కొనివ్వలేదని.. భర్తకు విడాకులు ఇవ్వాలనుకున్న భార్య

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

Show comments