Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిటెక్టివ్ కార్తీక్ ఎలా ఉందొ తెలుసా - రివ్యూ

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (12:15 IST)
dective kartik
తారాగణం : రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శృతి మోల్, అనూష నూతల, మదీ, అభిలాష్ బండారి
సాంకేతికత: రచయిత, దర్శకుడు: వెంకట్ నరేంద్ర, సహ నిర్మాత: పార్ధు రెడ్డి, నిర్మాత : అశోక్ రెడ్డి తాటిపర్తి, సినిమాటోగ్రఫీ: సిద్దం నరేష్ఎడిటింగ్: కార్తిక్ కట్స్, సంగీతం: మార్కస్ ఎమ్, ఆర్ట్ డైరెక్టర్: హేమంత్ కుమార్ జి
 
డిటెక్టివ్‌ సినిమాలంటే చాలామందికి ఆసక్తిగా వుంటుంది. ఏదో ఏ మర్డర్‌ను, కిడ్నాప్‌ అయినవారిని శోధించి ఛేదించి పట్టుకోవడంతో థ్రిల్‌ కలుగుతుంది. ఈ తరహా కథతో వచ్చిందే డిటెక్టివ్‌ కార్తీక్‌. లో బడ్జెట్‌ సినిమాతో తెరకెక్కిన ఈ సినిమాలో రజత్‌ రాఘవ్‌ పలు సినిమాలలో నటించాడు. ఇప్పుడు ఆయనే కీలక పాత్రతో రూపొందిన సినిమా ఇది. వెంకట్‌ నరేంద్ర దర్శకత్వం వహించిన ఈసినిమా ఆరోజే అనగా జులై 21న విడుదలైంది. మరి ఎలా వుందో చూద్దాం.
 
కథ:
నిర్మానుష్యమైన ఓ ప్రాంతంలో ఓ స్కూల్‌ విద్యార్థిని రిషిత  చనిపోయివుంటుంది. ఓ పేపర్‌బాయ్‌ పొద్దునే చూస్తాడు. కట్‌చేస్తే ప్రైవేట్‌ డిటెక్టివ్‌ సంధ్య (శృతి మోల్), పల్లవి (గోల్డీ నిస్సీ) తన బృందంతో వచ్చి శోధిస్టార్. ఆ పక్కనే స్కూల్‌కు చెందిన విద్యార్థిని ఆమె. ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను, సిబ్బందిని, స్టూడెంట్స్‌ను అడిగి కేసు సాల్వ్‌ చేయడానికి సంధ్య ప్రయత్నిస్తుంది. ఈలోగా షడెన్‌గా తను మాయమైపోతుంది. ఇది తెలుసుకున్న ప్రైవేట్‌ డిటెక్టివ్‌ రజత్‌ రాఘవ్‌ ఆమె మిస్సింగ్‌ కావడానికి స్కూల్‌ విద్యార్థిని చనిపోవడానికి లింక్‌ వుందనే ఆ కోణంలో ట్రై చేస్తాడు. ఆ క్రమంలో స్కూల్‌విద్యార్థిని హత్య ఎవరు చేసిందీ కనిపెడతాడు. కానీ మిస్సింగ్‌ అయిన డిటెక్టివ్‌ ఆఫీసర్‌ కోసం పలు ప్రయత్నాలు చేస్తుండగా ఓ రహస్యం తెలుస్తుంది. అది ఏమిటి? ఆమెను ఎవరు కిడ్నాప్‌ చేశారు? చివరికి ఏమయింది? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
ఈ కథలో డైరెక్ట్‌గా ప్రైవేట్‌ డిటెక్టివ్‌ కోణంలోనే కథ రాసుకున్నాడు దర్శకుడు. ఈ కథలో రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు. స్కూల్‌ ఏజ్‌లో బాగాచదివే అమ్మాయిలుంటే వారిని చూసి నేర్చుకోండని ఇతరులు అనడంతో వారి అహం ఎలా దెబ్బతింటుందో కూపించాడు. ఇక యూత్‌ వీడియోకాల్స్‌ పేరుతో అమ్మాయిలు ఏవిధంగా టార్గెట్‌ చేస్తుంటారో వారివెనుక ఎవరు ఉంటారనేది క్లారిటీగా చెప్పాడు. ఇవి రెండు కథలుగా చూపించాడు. రెండూ ఆసక్తికరమైన పాయింట్లే. వాటిని లింక్‌ చేస్తూ తీసిన ఈ సినిమా మొదటిభాగం సోసోగా సాగిపోతుంది. కానీ సెకండాఫ్‌లోకి వచ్చేసరికి ట్రాక్‌ ఆసక్తిగా మారుతుంది.
 
యూత్‌ను టార్గెట్‌ చేస్తూ లక్షలు గుంజేలా వారి బలహీనతలను క్యాష్‌ చేసుకునే క్రమంలో ఆ వ్యక్తిని కనిపెట్టాలనే కోణంలో డిటెక్టివ్‌ రజత్‌ రాఘవ్‌ చేసిన ప్రయత్నాలు ఆసక్తిగా వుంటాయి. కథలో రన్‌లో అతని ఫ్రెండ్‌గా కాస్త ఎంటర్‌టైన్‌ చేస్తాడు. ఇందులో అంతా కొత్తవారు కావడంతో కాస్తో కూస్తో అనుభవం వున్న వారిలా నటించారు. ప్రపంచమే డబ్బుచుట్టూ తిరుగుతుంటుంది. కుటుంబ సంబంధాలు కూడా అలానే వుంటాయి. ఆ కోణంలో వచ్చిన డైలాగ్‌లు, సన్నివేశాలు బాగున్నాయి.
 
ఈ సినిమాచాలా పరిమిత బడ్జెట్‌తో తీశారు. డిటెక్టివ్‌ కథ కనుక దీనిపై సి.ఐ.డి. సీరియల్స్‌ ప్రభావం కూడా కనబడుతుంది. కొత్తగా తాను అనుకున్న పాయింట్‌ను దర్శక నిర్మాతలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో స్కూల్‌ ప్రిన్స్‌పాల్‌ ఎలా వుండకూడదో చూపించాడు. సమాజంలో జరుగుతున్న కొన్ని ఫేక్‌ ట్రాన్‌సాక్షన్స్‌ ఎలా వుంటాయో చెప్పే ప్రయత్నం చేశాడు. నిర్మాణ విలువలు సాదాసీదాగా వున్నాయి. పొందికగా సినిమాను తీసినట్లుంది. అక్కడక్కడా లోపాలున్నా ఓ సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఏమేరకు ఆకట్టుకుంటుందో ప్రేక్షకుల తీర్పుపై ఆధారపడి వుంటుంది.
రేటింగ్‌: 2.5/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

కంట్లో నలక పడిందని వెళితే కాటికి పంపిన ఆసుపత్రి

జార్ఖండ్‌లో 24 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. మళ్లీ సీఎంగా హేమంత్ సోరేన్

నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...

మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments