Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరమా.. మరి అబ్బాయిలు విషం కదా. ప్రాణాలే తీస్తున్నారు.. రకుల్ ఫిట్టింగ్ రిప్లై

అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అంటూ నాగ చైతన్య తాజా చిత్రంలోని డైలాగ్ ఏ క్షణంలో బయటికి వచ్చిందో కానీ అది ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. తాజాగా టాలీవుడ్‌లో సీనియర్ మోస్ట్ నటుడు చలపతిరావు నాగచైతన్య హీరోగా వస్తోన్న 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో ఫంక్షన్‌

Webdunia
మంగళవారం, 23 మే 2017 (04:11 IST)
అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అంటూ నాగ చైతన్య తాజా చిత్రంలోని డైలాగ్ ఏ క్షణంలో బయటికి వచ్చిందో కానీ అది ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. తాజాగా టాలీవుడ్‌లో సీనియర్ మోస్ట్ నటుడు చలపతిరావు  నాగచైతన్య హీరోగా వస్తోన్న 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో ఫంక్షన్‌ సందర్భంగా యాంకర్ ఇదే ప్రశ్న సందిస్తూ అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా సర్ మీ అభిప్రాయం ఏమిటి అని మైక్ ముందు పెట్టినప్పుడు  నువ్వు అలా అడిగితే నేనేం చెప్పాలి నాయనా అంటూనే మైక్ అందుకుని అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికొస్తారు అంటూ ఘోరమైన కామెంట్ చేశారు.


ఇంత వయసొచ్చింది ఇదేం పాడుబుద్ధి అంటూ నెటిజన్లు చలపతిరావును దుమ్మెత్తి పోస్తున్నారు. 
 
నాగచైతన్య సరసన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ ప్రశ్నకు మరో విధంగా జవాబు చెప్పింది. అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం.. అని అంటున్నారుగా.. ఈ మధ్యనే నేను కొత్తగా ఒకటి ఆలోచించాను. అబ్బాయిలు విషపూరితం. అమ్మాయిల వల్ల హాని మాత్రమే. కానీ అబ్బాయిల వల్ల ప్రాణనష్టమే జరుగుతుంది.  నేనన్న మాటలు విన్నవాళ్లందరూ ‘భలే చెప్పారే’ అని అంటున్నారు అని రకుల్ ఫిట్టింగ్ రిప్లై ఇచ్చేసింది.
 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments