Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్బుల్లో వాయించే డీజే కాదు.. పగిలిపోయేలా వాయించే డీజే- డైలాగ్స్ అదుర్స్.. 12 గంటల్లోనే? (Trailer)

బన్నీ హీరోగా చేస్తున్న సినిమా డీజే (దువ్వాడ జగన్నాథమ్). హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డైలాగులు అదిరిపోతున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను దిలిరాజు గ్రాండ్‌గా

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (10:27 IST)
బన్నీ హీరోగా చేస్తున్న సినిమా డీజే (దువ్వాడ జగన్నాథమ్). హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డైలాగులు అదిరిపోతున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను దిలిరాజు గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కేవలం కొద్ది గంటల ముందే ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించినా.. రికార్డ్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది.
 
బ్రాహ్మణుడిగా బన్నీ చెప్పిన ఫన్నీ డైలాగ్‌లతో పాటు 'పబ్బుల్లో వాయించే డీజే కాదు.. పగిలిపోయేలా వాయించే డీజే..' 'మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్ఛామీ కాదు సార్‌.. యుద్ధం శరణం గచ్ఛామీ' లాంటి డైలాగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ ట్రైలర్‌ రిలీజ్‌ అయిన 12 గంటల్లోనే రెండున్నర మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా జూన్ 23వ తేదీన రిలీజ్ కానుంది. 
 
ట్రైలర్‌లో బన్నీ స్టైలుకు అందరూ ఫిదా అయిపోతున్నారు. మరోవైపు బన్నీ ట్రైలర్‌కు ఎప్పటిలాగే యాంటీ ఫ్యాన్స్ నుండి డిస్ లైక్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ ట్రైలర్‌కు ఏకంగా పదివేల మందికిపైగా డిస్ లైక్‌లు కొట్టారు. బన్నీ ట్రైలర్‌లకు కొందరు అదేపనిగా చేసుకొని డిస్ లైక్స్ కొడుతున్నారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments