Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ ఫీవర్ మొదలైంది... దీపావళికి పోటీపడుతున్న త్రీ మూవీస్

నవంబర్ అంటే దీపావళి. దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. ఈ యేడాది దీపావళిని నెలంతా జరుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నవంబరు నెలలో మూడు భారీ బడ్జెట్ చిత్రాలు రిలీ

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (16:30 IST)
నవంబర్ అంటే దీపావళి. దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. ఈ యేడాది దీపావళిని నెలంతా జరుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నవంబరు నెలలో మూడు భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.
 
ఇందులో మొదటగా రిలీజ్ కాబోతున్న సినిమా "సర్కార్". తమిళ హీరో విజయ్ నటిస్తున్న సర్కార్ ఫస్ట్ లుక్‌తోనే సంచలనం సృష్టించింది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం ఇప్పటికే హైలైట్‌గా నిలిచింది. రైట్స్ విషయంలోనూ ఈ సినిమా దూసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా ఈ సినిమా రైట్స్ అమ్ముడు పోయినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం నవంబరు ఆరో తేదీన విడుదలకానుంది. ఏఆర్.మురుగదాస్ - విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 
 
ఇకపోతే, బాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "థగ్స్ ఆఫ్ హిందూస్థాన్". అమీర్ ఖాన్, అమితాబ్, కత్రినా వంటి ప్రముఖ తారలు నటించిన ఈ సినిమా విజువల్ వండర్‌గా రూపుదిద్దుకుంటున్నది. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నది. 'బాహుబలి' తర్వాత ఆ రేంజ్ గ్రాఫిక్స్‌తో నిర్మితమౌతున్న సినిమా కావడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ లుక్స్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా నవంబర్ 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు. 
 
ఇక ఈ దీపావళికి విడుదలకానున్న మూడో సినిమా రోబో '2.O'. ఆసియాలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమైన సినిమా ఇది. కేవలం గ్రాఫిక్స్ వర్క్స్ కోసమే రూ.540 కోట్లను లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఖర్చు చేసినట్టు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ సంచనాలు నెలకొల్పింది. రజినీకాంత్, అక్షయ్ కుమార్‌లు నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 29వ తేదీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

Volunteers: వాలంటీర్లను హెచ్చరించాం.. వారివల్లే ఓడిపోయాం... గుడివాడ అమర్‌నాథ్

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments