Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)

ఠాగూర్
గురువారం, 28 నవంబరు 2024 (11:04 IST)
సాధారణంగా సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే.. ప్రయోగాలు చేయడానికి బోల్డ్‌గా నటించటానికి కొందరు హీరోహీరోయిన్లు వెనుకంజ వేయరు. ఇపుడు అలాంటి సాహసమే ఓ హీరోయిన్ చేశారు. ఆమె పేరు దివ్యప్రభ. మలయాళ నటి. దీంతో ఆమె ఇపుడు వార్తల్లో నిలిచారు. 'ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌' అనే పేరుతో తెరకెక్కే చిత్రంలో ఆమె ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కని కుశృతి మరో ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీకి పాయల్‌ కపాడియా  దర్శకత్వం వహించారు.
 
ఇటీవల ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి. అందులో ప్రధానంగా ఈ సినిమాలోని న్యూడ్ సీన్ సోషల్ మీడియా లో విపరీతంగా షేర్ అవుతోంది. నెటిజెన్స్ దివ్యప్రభ సన్నివేశంపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా తన న్యూడ్ సీన్స్ వైరల్ కావడంపై హీరోయిన్ దివ్యప్రభ స్పందిస్తూ.. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడే.. ఇలాంటి సిట్యువేషన్ వస్తుందని ఊహించినట్లు తెలిపింది. తాను నటించే పాత్రకు ప్రాధాన్యత ఉండాలని చూసుకునే అలాంటి పాత్రల్లో నటిస్తానని ఈ సినిమాలో పాత్ర కూడా తనకెంతో నచ్చటంతోనే బోల్డ్‌గా నటించినట్లు పెర్కొంది. కొందరు ఫేమ్‌, పాపులారిటీ కోసం న్యూడ్‌ సీన్‌లో యాక్ట్‌ చేశానని అంటున్నారు. ఫేమ్ కోసం బట్టలు విప్పి నటించాల్సిన తనకు అవసరం లేదన్నారు. 
 
తాను గతంలోనే ఎన్నో అవార్డులు పొందినట్లు గుర్తు చేశారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాల్లో నటించినట్లు దివ్య ప్రభ తెలిపింది. ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌ సినిమాలో స్త్రీల జీవితాలు, వారు ఎదుర్కునే కష్టాల గురించి దర్శకురాలు పాయల్  కపాడియా రియలిస్టిక్‌‌గా చూపించారు. ఈ చిత్రం యేడాది ప్రారంభంలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమాకు అంతర్జాతీయ పబ్లికేషన్స్‌లో మంచి రివ్యూలు కూడా లభించాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం