దర్శకుడు క్రిష్ షో రన్నర్ గా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ 9 అవర్స్ వెబ్ సిరీస్

Webdunia
గురువారం, 12 మే 2022 (18:47 IST)
9 Hours
సరికొత్త కంటెంట్ ను ఎప్పటికప్పుడు వ్యూయర్స్ కు సిద్ధం చేస్తున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. 9 అవర్స్ పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తుండటం విశేషం. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధు షాలినీ, రవి వర్మ, ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. 
 
పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ జూన్ 2 తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు ఓ భారీ దొంగతనానికి ప్లాన్ చేస్తారు. జైలు నుంచి తప్పించుకున్న వాళ్లు బ్యాంక్ లోకి ఎలా చొరబడారు. అక్కడ వాళ్లు అనుకున్న ప్లాన్ వర్కవుట్ అయ్యిందా, ఇంతలో పోలీస్ తీసుకున్న చర్యలేంటి అనేది ఈ వెబ్ సిరీస్ లో ఆసక్తికరంగా చూపించబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag లోని G కాస్త Googleగా నిలబడింది: చంద్రబాబు

ఆయన మా డాడీయే కావొచ్చు.. కానీ ఈ యాత్రలో ఆయన ఫోటోను వాడను : కవిత

త్వరలో వందే భారత్ 4.0 : రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి రాబోతోందా? సీఎం అభ్యర్థిగా టీవీకే చీఫ్ విజయ్?

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments