హీరోయిన్ మాళవికా మోహనన్ కి విక్రమ్ సరసన నటించిన తంగలాన్ చిత్రానికి మంచి పేరు వచ్చింది. తెలుగులో ప్రభాస్ తో రాజాసాబ్, కార్తీతో సర్దార్ 2 సినిమాలు చేస్తోంది. మలయాళంలో మోహన్ లాల్ తో ఓ సినిమా చేస్తుంది. ఇటీవలే పూనెలో షూటింగ్ చేస్తున్నాననీ, చాలా ప్లజెంట్ గా వుందని సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేసింది. అదేవిధంగా అసలు సినిమాల్లో హీరోయిన్లను ఏవిధంగా చూపిస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చింది.
ఫొటో షూట్ లోనూ, సినిమాల్లోనూ నాకు తెలిసి సౌత్ లో దర్శకులు హీరోయిన్ అందాలపై కాన్ సన్ ట్రేషన్ చేస్తారు. ముఖ్యంగా హీరోయిన్ల నాభి, నడుము చూపించడానికి డైరెక్టర్లు ఎక్కువగా దృష్టి పెడతారు అంటూ ట్రీట్ చేసింది. ఇంతకీ, ఇంకా మాళవికా మోహనన్ తెలుపుతూ, దక్షిణాది సినిమాల్లో నేను నటిస్తున్నాను. ఆ సినిమాల గురించే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అని మాళవికా మోహనన్ చెప్పుకొచ్చింది.
నేను ముంబైలో పెరగడంతో ఇక్కడ నటిస్తుంటే నాకు మొదట అర్థంకాలేదు. నాకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. హీరోయిన్ల ఫొటోలు షూట్ చేశాక దర్శకులు శరీర భాగాలను జూమ్ చేసి మరీ చూస్తారని గ్రహించానని మాళవిక చెబుతోంది. మరి దీనిపై మరికొందరు నటీమణులు స్పందిస్తారేమో చూడాలి.