Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుమన్‌పై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన దర్శకుడు శివనాగు

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (16:53 IST)
Suman-Sivanagu
‘నటరత్నాలు’ చిత్రం ఆడియో ఫంక్షన్‌ వేదికగా సుమన్‌పై చేసిన వ్యాఖ్యలకు శివనాగు క్షమాపణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఈ వీడియో విడుదల చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన నట రత్నాలు ఆడియో ఫంక్షన్‌లో శివనాగు సీనియర్‌ హీరో సుమన్‌ను తన ఆడియో ఫంక్షన్‌కు అతిథిగా ఆహ్వానిస్తే రెండు లక్షలు డిమాండ్‌ చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే! దీనిపై అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చారు. 
 
శివనాగు మాట్లాడుతూ ‘‘సుమన్‌గారు నా కుటుంబానికి ఎంతో కావల్సిన వ్యక్తి. ఆయనతో మూడు సినిమాలు చేశా. నా పిల్లలు ఇద్దరు నిర్మిస్తున్న ‘నట రత్నాలు’ చిత్రం ఆడియో ఫంక్షన్‌కు ఆయన్ని ఆహ్వానించి, సన్మానించాలనుకున్నా. ఆయన్ను పిలిచే క్రమంలో మేకప్‌మెన్‌ వెంకట్రావు చెప్పడం సమస్యో, నేను వినడం పొరపాటో తెలీదు కానీ ఫంక్షన్‌ టెన్షన్‌లో ఉండి సుమన్‌గారిపై ఆరోపణలు చేశాను. దీనిపై చాలామంది నిర్మాతలు నాకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అప్పుడు గానీ నేను పొరపాటు మాట్లాడానని గమనించలేదు. మీడియా ముఖంగా సుమన్‌గారికి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments