Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (18:06 IST)
Shekhar Kammula
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల సందడి చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యునికేషన్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న 24వ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శేఖర్ కమ్ముల రాకతో ఉస్మానియాలోని ఠాగూర్ ఆడిటోరియం విద్యార్థుల కేరింతలో మారుమోగిపోయింది. శేఖర్ కమ్ముల చిత్రాలతో తయారుచేసిన ఏవీకి ఈ ఈవెంట్ కు వచ్చిన ఇతర అతిథులతోపాటు విద్యార్థులు ఫిదా అయిపోయారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి శేఖర్ కమ్ముల ప్రసంగించారు.
 
Educational Film Festival launch
" ఫిల్మ్ ఫెస్టివల్ కు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంటే బిర్యానీ, ఇరానీ చాయ్ కే కాదు... గొప్ప ప్రేమకు నిలయం. ఈ విషయం నా సినిమా ద్వారా చెప్పాను. కానీ ఇక్కడ చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులున్నారు కాబట్టి మరోసారి చెబుతున్నా. హైదరాబాద్ ను చూస్తే ఎవరైనా ప్రేమలో పడాల్సిందే. కుల్ కుత్బుషా-భాగమతిల ప్రేమ చాలా అందంగా ఉండేది. మూసీ నది ఒడ్డున వారి ప్రేమ గొప్పగా సాగింది. వారి ప్రేమకు నిదర్శనంగా అప్పట్లో ప్యారనాఫూల్ బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడు మనం దాన్ని పురానాపూల్ బ్రిడ్జి అంటున్నాం. 
 
అలాగే వినిస్ట్రన్ చర్చిల్-ఫ్యాములా హైదరాబాద్ వీధుల్లో ఏనుగుపై తిరిగేవారట. కోఠి ఉమెన్స్ కళాశాల చుట్టూ ఓ గొప్ప ప్రేమ కథ ఉంది. ఇలా హైదరాబాద్ లో ఎక్కడ చూసిన ప్రేమ కనిపిస్తుంది. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా దేశంలో ఎక్కడా లేని చరిత్ర ఉంది. పీవీ నర్సింహారావు, నాగేశ్ శర్మ, శ్యామ్ బెనగల్, అజారుద్దీన్ ఇలా అనేక రంగాల్లో గొప్పవాళ్లు ఇక్కడి నుంచి వెళ్లినవాళ్లు. 
 
హైదరాబాద్ అంటే అంత ప్రేమ మనకు. సినిమాలతో కూడా ఇక్కడ ప్రేమలో పడొచ్చు. సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు వచ్చాయి. మన ప్రాంతం, మన దేశం అని కాకుండా ప్రపంచమంతా చూసే సినిమాలు వస్తున్నాయి. ఈరోజు మనం లేకున్నా రేపు మన సినిమాలు బతికే ఉంటాయి. సినిమా అనేది నా దృష్టిలో ఏంటంటే... సొసైటీలో చెడు ఉందని, అదే తీస్తున్నామంటారు కొంత మంది. సినిమాలు ఇట్లనే ఉంటాయంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నువ్ సినిమా తీయాలి. కానీ చెడును సవరించేలా ఉండాలి. మంచిని ప్రొత్సహించేలా ఉండాలి. సినిమా ద్వారా మంచి మార్పును తీసుకొచ్చేలా ఉండాలి. ఇదే విషయాన్ని నేను నా సినిమాల ద్వారా ప్రయత్నిస్తుంటాను. సినిమా అనేది యూనివర్శల్ గా ఉండాలి. న్యూయార్క్ లో భాష తెలియని వాడు కూడా చూస్తే అతనికి అర్థం కావాలి. సినిమాకు యూనివర్శల్ అప్పీల్ ఉండాలి. ఇవాళ తీసిన సినిమా మరో పదేళ్లైనా చూసేలా ఉండాలి. పాత పడకూడదు. ఆది చూశాక గర్వపడేలా ఉండాలి. పిల్లలతో కలిసి చూసేలా ఉండాలి. 
 
కానీ ఇది ఎలా సాధ్యమంటే... సాధ్యమవుతుందని నేను నమ్ముతాను. అందుకే కిందిస్థాయి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాలి. డాక్యుమెంటరీ, ఫిల్మ్ ఏది తీసినా, ఎక్కడ పోస్టు చేసినా దిగువ స్థాయిని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎంపథితో చూడాలి. మనిషి-జంతువువైపు ఆలోచిస్తే జంతువు తీసుకోవాలి. పురుషుడు-స్త్రీ అంటే స్త్రీ వైపు ఆలోచించాలి. మన ఈగోలను పక్కనపెట్టి ఎంపథితో వెళ్లాలి. ఐన్ స్ట్రీన్ కూడా గాంధీని గొప్ప మనిషిగా భావిస్తాడు. అదే దారిలో నేను సినిమాలు తీస్తాను. అందుకేచాలా మంది నా సినిమాలను ఇష్టపడతారు.  విద్యార్థులు మీరు ఏం కల కంటున్నారో వాటిని సాధించేందుకు కృషి చేస్తే గొప్పవాళ్లు అయినట్టే. "
 
అనంతరం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ సహా ఇతర విభాగాలలో విజేతలుగా నిలిచిన 13 మందికి శేఖర్ కమ్ముల ట్రోఫితోపాటు సర్టిఫికెట్లను అందజేసి వారితో ఫొటో దిగి ఉత్సాహాపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments