Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ - శంకర్ - దిల్ రాజు కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:04 IST)
టాలీవుడ్‌లో మరో అరుదైన కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ దర్శకుడు శంకర్, ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‍‌లో ఓ చిత్రం నిర్మితం కానుంది. 
 
నిజానికి లాక్డౌన్‌లో ప్రతి హీరో రెండు మూడు సినిమాలకు సైన్‌ చేసి.. ప్రకటనలు కూడా చేశారు. కానీ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మాత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత చేసే సినిమాని ఇంతవరకు ప్రకటించలేదు. 
 
మధ్యలో ఇద్దరు, ముగ్గురు దర్శకులతో చరణ్‌ సినిమా అంటూ పేర్లు వినిపించినా.. అవేవీ ఫైనల్‌ కాలేదు. తాజాగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత రామ్‌ చరణ్‌ చేయబోయే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. 
 
మెగా ప‌వ‌ర్‌స్టార్ చెర్రీ, శంకర్ కాంబినేషన్‌లో ఓ మూవీ రానుంది. శంకర్ దర్శకత్వంలో జెంటిల్‌మేన్‌, ప్రేమికుడు, ఇండియ‌న్‌, జీన్స్‌, ఒకే ఒక్క‌డు, అప‌రిచితుడు, రోబో, 2.0 వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ు వచ్చి, ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన  విషయం తెల్సిందే. 
 
ఇపుడు డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్స్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా ప్రెస్టీజియ‌స్ మూవీగా భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా చిత్రం రూపొంద‌నుందని అధికారికంగా ప్రకటించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments