Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా : లేఖా వాషింగ్టన్

లేఖా వాషింగ్టన్. తమిళ సినీ నటి. టీవీ యాంకర్‌ స్థాయి నుంచి సినీ నటిగా ఎదిగారు. ఈమె చిత్ర పరిశ్రమలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారట. అందం, అభినయం ఉన్నా విజయాలు దక్కక హీరోయిన్‌గా ఆమె కెరీర్‌ ఆ

Webdunia
ఆదివారం, 26 మార్చి 2017 (11:11 IST)
లేఖా వాషింగ్టన్. తమిళ సినీ నటి. టీవీ యాంకర్‌ స్థాయి నుంచి సినీ నటిగా ఎదిగారు. ఈమె చిత్ర పరిశ్రమలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారట. అందం, అభినయం ఉన్నా విజయాలు దక్కక హీరోయిన్‌గా ఆమె కెరీర్‌ ఆశించిన స్థాయిలో సాగలేదు. ఇప్పుడు ఆమె ఖాతాలో ఒక్క సినిమా కూడా లేదు. 
 
చివరిగా ప్రసన్నకు జోడీగా ‘కల్యాణ సమయల్‌ సాదమ్‌’ అనే చిత్రంలో కనిపించింది. ఈమె తాజాగా బాంబు పేల్చింది. లైంగిక వేధింపులకు గురైన హీరోయిన్లలో తానూ ఉన్నానని, సెక్స్‌ టార్చర్‌ను తానూ అనుభవించానని చెప్పుకొచ్చింది. ఓ సినిమాలో అవకాశం ఇస్తానని ఒక తమిళ దర్శకుడు లైంగికంగా వేధించాడని బహిరంగం చేసింది. 
 
కథ చెప్పిన తర్వాత ‘ఈ సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తే బదులుగా నాకేం ఇస్తావు?’ అనడిగాడని, అతని దుర్భుద్ధి తనకు అర్థమైనా తెలియనట్టు నటిస్తే పదే పదే అదే ప్రశ్న వేస్తూ విసిగించాడని ఆక్రోశంగా చెప్పింది. సినిమా నటిగా జీవించడం సులభమైన విషయం కాదని, ఎన్నో సవాళ్లును ఎదుర్కొంటూనే ఉంటారని లేఖ వాపోయింది.
 
కాగా, మలయాళ నటి భావన కిడ్నాప్‌, లైంగి దాడి ఉదంతం తర్వాత హీరోయిన్లు ఒక్కొక్కరుగా తమకు ఎదురైన చేదు అనుభవాలను బహిరంగపరుస్తున్న విషయం తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం