Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

ఠాగూర్
సోమవారం, 19 మే 2025 (23:45 IST)
తాను ఒక అద్భుతమైన చిత్రాన్ని చూశానని, ఎవరు కూడా మిస్ కావొద్దంటూ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. తమిళ హీరో శశికుమార్, సిమ్రాన్ జంటగా నటించిన చిత్రం "టూరిస్ట్ ఫ్యామిలీ". ఈ నెల ఒకటో తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని రాజమౌళి తాజాగా చూసి తన స్పందనను తెలియజేశారు. ఈ సినిమా తనకు గొప్ప అనుభూతినిచ్చిందని, ఇటీవలి కాలంలో తాను చూసిన అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటని కొనియాడారు. 
 
'టూరిస్ట్ ఫ్యామిలీ' అనే అద్భుతమైన సినిమాను చూశాను. ఈ చిత్రం తనను ఎంతగానో ఆకట్టుకుంది. మనసును హత్తుకోవడమేకాకుండా కడుపుబ్బా నవ్వించే హాస్యంతో ఉంది. కథనం మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను లీనం చేస్తుందని వివరించారు. 
 
చిత్ర దర్శకుడు అభిషన్ జీవింత్ రచన, దర్శకత్వం చాలా గొప్పగా ఉంది అంటూ పనితీరును మెచ్చుకున్నారు. ఇలాంటి ఒక మంచి సినిమాను అందించినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో ఇది నాకు ఉత్తమ సినిమాటిక్ అనుభూతిని అందించింది అని రాజమౌళి వ్యాఖ్యానించారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని ఎవరూ మిస్ చేసుకోవద్దని ఆయన ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments