టాలీవుడ్ డ్రగ్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు పూరి జగన్నాథ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు.
ఈ క్రమంలో పూరి బ్యాంక్ లావాదేవీలపై పూర్తిగా ఆరా తీశారు. ఆయనకు చెందిన మూడు బ్యాంక్ ఖాతాల నుంచి సమాచారం సేకరించారు. ఉదయం 10.17 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు విచారణ కొనసాగింది.
ఈ క్రమంలో ఈడీ పూరి స్టేట్‌మెంట్‌ను లిఖిత పూర్వకంగా నమోదు చేసింది. భవిష్యత్తులో విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని అధికారులు ఆయనను ఆదేశించారు.