Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఖబడ్దార్" అన్నది మెగా హీరోల గురించి కాదు.. మా మధ్య 'కంచె' నిర్మించొద్దు ప్లీజ్ : క్రిష్‌ విజ్ఞప్తి

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి. ఈ చిత్రం ఆడియో వేడుక ఇటీవల తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు జాగర్లమూడి క్రిష్ తన ప్రసంగం చివర్లో ఖబడ్దార్ అని

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (11:38 IST)
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి. ఈ చిత్రం ఆడియో వేడుక ఇటీవల తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు జాగర్లమూడి క్రిష్ తన ప్రసంగం చివర్లో ఖబడ్దార్ అని అన్నారు. అది ఫిల్మ్ నగర్‌లో వివాదాస్పదంగా మారి పెద్ద చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి బరిలో తమ సినిమాతో పోటీ పడుతున్న ‘ఖైదీ నెంబర్‌ 150’ని ఉద్దేశించే క్రిష్‌ అలా అన్నాడని పలు ఛానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. ఇది పెద్ద వివాస్పదమయ్యే సూచనలున్న నేపథ్యంలో క్రిష్‌ ఆ వ్యాఖ్యపై స్పందించాడు.
 
'నేను అన్న "ఖబడ్దార్"’ అనే పదానికి కొత్త అర్థాలను వెతకొద్దు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి తరపున నేను ఆ మాట అన్నాను. మన సంస్కృతికి, సంప్రదాయాలకు సరైన గౌరవం దక్కడం లేదనే తెలుగు ప్రజల బాధనే నేను వ్యక్తం చేశాను. నేను ‘ఖబడ్దార్‌’ అని హెచ్చరించింది తెలుగు వారిని గౌరవించని, దేశాన్ని, ప్రపంచాన్ని. అంతే తప్ప వ్యక్తులను కాదు' అని క్రిష్‌ వివరించాడు.
 
తాను మెగా హీరోలను ఉద్దేశించే ఆ మాట అన్నానని వార్తలు ప్రసారం చేస్తున్నారని, కానీ తనకు వారితో మంచి అనుబంధముందని తెలిపాడు. ‘నా రెండో సినిమాయే బన్నీ (వేదం)తో చేశాను. నాలుగో సినిమా ‘కంచె’ వరుణ్‌తేజ్‌తో చేశాను. నేను సినీ పరిశ్రమలోకి ఎంటర్‌ అవకముందు నుంచే చరణ్‌ నాకు మంచి ఫ్రెండ్‌. ఇక, నేను సినిమాల్లోకి ఎంటర్‌ కావడానికి చిరంజీవిగారు స్ఫూర్తి. ఇలాంటి దురుద్దేశాలు ఆపాదించి తనకు, మెగా ఫ్యామిలీకి మధ్య కంచె నిర్మించొద్ద’ని క్రిష్‌ విజ్ఞప్తి చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments