Webdunia - Bharat's app for daily news and videos

Install App

"డైరెక్టర్" ఫస్ట్ లుక్ విడుదల!!

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (16:12 IST)
తొలి చిత్రం "నాటకం" వంటి విభిన్నకథాచిత్రంతో తనని తాను ప్రూవ్ చేసుకొని హీరోగా ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వెర్సటైల్ యాక్టర్ ఆశీష్ గాంధీ. మలి చిత్రంగా మరో సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. 
 
శ్యామ్ మరొక హీరోగా మరీనా, ఐశ్వర్య, ఆంత్ర హీరోయిన్స్‌గా  మాస్టర్ జశ్విన్ రెడ్డి సమర్పణలో విజన్ సినిమాస్, దీపాల ఆర్ట్స్ బ్యానర్లు పై కిరణ్ పొన్నాడ - కార్తీక్ కృష్ణ  దర్శకత్వంలో రూపొందుతోన్న "డైరెక్టర్" చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. 
 
ఆశీష్ గాంధీ కెరియర్ని మలుపు తిప్పే చిత్రం ఇది!! 
ఇప్పటివరకు తెలుగు తెరపైన ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు వచ్చాయి.. వస్తున్నాయి.. ఆడియెన్స్‌కి నచ్చే, మెచ్చే చిత్రాలు సక్సెస్ అవుతున్నాయి. అంతేకాదు ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు అబ్బురపరిచే విజువల్స్ కథలో అనేక ట్విస్టులు ఉంటేనే అచిత్రం ప్రజాదరణ పొందుతుంది. 
 
అలాంటి చిత్రమే మా "డైరెక్టర్". మా హీరో ఆశిష్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ చిత్రం ఆశిష్ కెరియర్ ని మలుపు తిప్పే చిత్రం అవుతుంది.. సాయి కార్తీక్ బ్యూటిఫుల్ బాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు... ఆదిత్య వర్ధన్ కెమెరా విజువల్స్ మా సినిమాకి వన్ ఆఫ్ ది ఎస్సెట్ కానుంది. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్నీ పనులు పూర్తిచేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అని నిర్మాతలు నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల తెలియజేసారు.
 
అన్ ఎక్స్పెక్టెడ్ స్టోరీ తో వస్తున్న డిఫరెంట్ థ్రిల్లర్! 
సస్పెన్స్ థ్రిల్లర్‌తో రూపొందిస్తున్న "డైరెక్టర్" చిత్రాన్ని మేము డైరెక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా  టెక్నీకల్ టీం అందరూ ఎంతో సపోర్ట్ చేశారు.. అందరి సహకారంతో ఈ చిత్రాన్ని అనుకున్న టైంలో పూర్తి చేసాం. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ కోపరేషన్ మరువలేనిది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రంని నిర్మించారు. వారికి మా థాంక్స్. 
 
అలాగే మా హీరో ఆశిష్ గాంధీ నాటకం చిత్రం తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా సెలెక్టెడ్‌గా కథలను చూజ్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. మా కథ విని ఎంతో ఇంప్రెస్ అయి ఈ చిత్రం చేశాడు. డెఫినెట్‌గా ఈ డైరెక్టర్ చిత్రం పెద్ద హిట్ అయి మా టీం అందరికీ మంచి పేరు తెస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.. అని చిత్ర దర్శకులు కిరణ్ పొన్నాడ, కార్తీక్ కృష్ణ అన్నారు.
 
ఆశీష్ గాంధీ, శ్యామ్ హీరోలుగా మరీనా, ఐశ్వర్య, ఆంత్ర హీరోయిన్స్‌గా  నటిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ అప్పారావు, వీరభద్రం, తిరుమలరెడ్డి, ఆర్కే, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 
 
ఈ చిత్రానికి సంగీతం; సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ: ఆదిత్య వర్ధన్, ఎడిటింగ్: బి . నాగేశ్వర్ రెడ్డి, కో-ప్రొడ్యూసర్: తిరుమల రెడ్డి ఎల్ల, పి.ఆర్.ఓ.సాయి సతీష్, నిర్మాతలు: నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల, రచన-దర్శకత్వం: కిరణ్ పొన్నాడ, కార్తీక్ కృష్ణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments