Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్.. మీ తల్లికి బిడ్డ మాత్రమే కాదు... ఎంతోమందికి స్ఫూర్తి : డైరెక్టర్ బాబీ

తన తల్లిపై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్నారు.

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (17:02 IST)
తన తల్లిపై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్నారు. ఈ విషయం ప్రచారం కావడంతో ఫిల్మ్ చాంబర్‌కు ప్రతి ఒక్కరూ చేరుకుంటున్నారు. అదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం పవర్ స్టార్‌కు మద్దతు పలుకుతూ ఆయనకు సంఘీభావం ప్రకటిస్తోంది.
 
ఈనేపథ్యంలో పవన్ నటించిన "సర్దార్ గబ్బర్ సింగ్" చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ బాబి కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ఈయన చాలా భావోద్వేగంతో స్పందించారు. ''స‌ర్‌.. గ‌డిచిన‌ 48 గంట‌లు నా జీవితంలో అత్యంత క‌ఠిన‌మైన క్ష‌ణాలు. మీరు బాధ‌ప‌డుతున్నార‌ని తెలిసినా.. మీరు ఆప‌డం వ‌ల్ల‌ మేం స్పందించ‌లేదు.
 
కానీ, ఇప్పుడు జ‌రుగుతున్న‌ది చూస్తున్న త‌ర్వాత న‌న్ను నేను నియంత్రించుకోలేక‌పోతున్నా. నాకు క‌న్నీళ్లు ఆగ‌డం లేదు. మీరు ఆడ‌వారికి మీరు ఎంత‌ ర‌క్ష‌ణ‌గా ఉంటారో మీతో క‌లిసి ప‌నిచేసిన నాకు తెలుసు. ఇప్పుడు మేం మీకంటే ఎక్కువ బాధ‌ప‌డుతున్నాం. ఎందుకంటే మీరు మీ త‌ల్లికి మాత్ర‌మే బిడ్డ కాదు.. ఎంతో మందికి మీరు స్ఫూర్తి. మీకు నా సెల్యూట్‌. జైహింద్' అంటూ బాబీ ట్వీట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments