Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

డీవీ
మంగళవారం, 21 మే 2024 (16:58 IST)
Shanti Chandra, Deepika Singh, Simriti Bhatija, Nikkisha Rangwala
ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటిస్తున్న సినిమా ‘డర్టీ ఫెలో’. ఈ చిత్రంలో దీపిక సింగ్, సిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాలా హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ‘డర్టీ ఫెలో’ చిత్రాన్ని గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై జి శాంతి బాబు నిర్మిస్తున్నారు. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, హీరో సంపూర్ణేష్ బాబు గెస్ట్ లుగా పాల్గొన్నారు.

Dirty Fellow team with Sampuranesh Babu, veerashankar
ఈ సందర్భంగా హీరో శాంతి చంద్ర మాట్లాడుతూ -  ఇండియన్ నేవీలో చేరాక అక్కడ మేము చేసే సాహసాల టైమ్ లోనూ కెమెరా ఉందనే అనిపించేది. ఎప్పటికైనా హీరో కావాలనే కలగన్నాను. మంత్ర సినిమాతో ఆ కోరిక తీరింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో కొంత గ్యాప్ వచ్చింది. డర్టీ ఫెలో కథను నమ్మాను కాబట్టే ఇన్వెస్ట్ చేశాను. మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఔట్ డోర్స్ కు వెళ్లాం. డాన్ మూవీ కాబట్టి హాలీవుడ్ లా డ్రైగా చేయలేదు. మా సినిమాలో గ్లామర్ ఉంటుంది. నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. డర్టీ ఫెలో ఒక డిఫరెంట్ మూవీ. ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్, యాక్షన్, రొమాన్స్ అన్నీ ఉంటాయి. ఎక్కడా ల్యాగ్ ఉండదు. మూవీ బిగినింగ్ నుంచి అలా వెళ్తూ ఉంటుంది. మా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. డర్టీ ఫెలో హిట్ అనేది మా మూవీ టైటిల్ సాంగ్ చేసినప్పుడే నమ్మకం కుదిరింది. ఆ పాట షూటింగ్ చేసేదాక నేను నిద్రపోలేదు. మా సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఇది ధమాకా, బ్లాస్ట్ లాంటి సక్సెస్ అందుకుంటుంది. అన్నారు.
 
హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ - శాంతి చంద్ర నాకు ఒక బ్రదర్ లాంటి వ్యక్తి. ఆయన మంచి వాడు. సినిమాకు డర్టీ ఫెలో టైటిల్ ఎందుకు పెట్టారని అడిగాను. ఈ సినిమాకు ఆ టైటిల్ తప్ప మరో ఛాయిస్ లేదని డైరెక్టర్ గారు చెప్పారు. సినిమా మీద ప్యాషన్ ఉన్న శాంతి చంద్ర అన్న హీరోగా ఈ మూవీ చేస్తుండటం సంతోషంగా ఉంది. డర్టీ ఫెలో సినిమా పాటలు, ట్రైలర్ చూశాను. మంచి కథతో వస్తున్న మూవీ ఇది. డాక్టర్ సతీష్ మ్యూజిక్ సూపర్బ్ గా ఉంటుంది. డర్టీ ఫెలో సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
దర్శకుడు ఆడారి మూర్తి సాయి మాట్లాడుతూ,  ఒకప్పుడు మన సినిమాలకు శతదినోత్సవాలు జరుపుకునేవాళ్లం. ఇప్పుడు రెండు రోజులకే సినిమా లైఫ్ ఫినిష్ అవుతూ జత దినోత్సవాలు జరుపుకునే పరిస్థితి వచ్చింది. టీవీ వచ్చాక సినిమా పనైపోయింది అన్నారు. పైరసీ వచ్చాక ఇక సినిమా బతకలేదన్నారు. అయినా ఇండస్ట్రీ తట్టుకుని ముందడుగు వేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు పైరసీ కాదు ప్రైవసీ జబ్బు వచ్చింది. ఎవరికి వారు ఇంటినే హోమ్ థియేటర్ లా భావిస్తున్నారు. ఇంట్లో పూజగది ఉంటే దేవాలయం కాదు. సినిమాను థియేటర్ లోనే చూడండి. చిన్న సినిమాలను బతికించండి. లేకుంటే ఒకప్పుడు తోలు బొమ్మలాటలు ఆడేవారంట అని చెప్పుకున్నట్లే. థియేటర్ లో సినిమాలు ప్రదర్శించేవారంట అని రేపటి తరాలు చెప్పుకుంటాయి. అన్నారు.
 
దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ - డైరెక్టర్స్ డే ఈవెంట్ కోసం మూడు రోజులుగా నిద్రలేదు. వీళ్లు నాకు చాలా కావాల్సిన వాళ్లు అందుకే ఈ ఈవెంట్ కు వచ్చాను. మాస్ అంశాలతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా డర్టీ ఫెలో ఆకట్టుకుంటుంది. డర్టీ ఫెలో సినిమాను ఈ నెల 24న థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. శాంతి చంద్ర గారు ఇండియన్ నేవీలో తన అనుభవాలు, వాళ్లు చేసిన సాహసాలు చెబుతుంటే ఒళ్లు గగుర్పొడిచేది. ఆ నేపథ్యంతో సెయిలర్ అనే పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు శాంతి చంద్ర. ఆ సినిమాతో ఇండియా మొత్తంలో ఆయన గుర్తింపు తెచ్చుకుంటారు. అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ మాట్లాడుతూ - డైరెక్టర్ మూర్తి సాయి, శాంతి చంద్ర, నేను కలిసి కోవిడ్ టైమ్ లో దహనం అనే మూవీ చేశాం. ఆ సినిమాకు అవార్డ్స్ వచ్చాయి. మంచి పేరొచ్చింది. ఆ తర్వాత డర్టీ ఫెలో మూవీ గురించి డైరెక్టర్ గారు నాతో డిస్కస్ చేస్తుండేవారు. ఆ టైమ్ లో నేను కంపోజ్ చేసిన ఓ సాంగ్ నచ్చి శాంతి చంద్ర గారు ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. అలా ఒక పాట ఇచ్చిన ఇన్సిపిరేషన్ తో డర్టీ ఫెలో బిగిన్ అయ్యింది. ఆ పాటను సినిమాలో ఎస్పీ చరణ్, మాళవిక పాడారు. సినిమాకు నా వంతుగా న్యాయం చేశాననే భావిస్తున్నాను. శాంతి చంద్ర గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
లిరిసిస్ట్ పూర్ణాచారి మాట్లాడుతూ - డర్టీ ఫెలో సినిమాలో టైటిల్ సాంగ్ రాశాను. ఓ స్టార్ హీరోకు ఎలాగైతే లిరిక్స్ ఉంటాయో ఆ ప్యాట్రన్ లోనే ఉంటాయి సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. అన్నారు.
 
యాక్టర్ సత్యప్రకాష్ మాట్లాడుతూ - డర్టీ ఫెలో సినిమాకు పనిచేసిన యూనిట్ యూనిక్ గా సెట్ అయ్యింది. ఎక్స్ సర్వీస్ మెన్, బిజినెస్ మెన్ అయిన శాంతి చంద్ర హీరోగా డాక్టర్ అయిన సతీష్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. దహనం వంటి అవార్డ్ విన్నింగ్ మూవీ చేసిన ఆడారి మూర్తి సాయి ఇలాంటి మాస్ ఎంటర్ టైనర్ రూపొందించడం మరో ప్రత్యేకత. డర్టీ ఫెలో సినిమాలో నేను ఇంపార్టెంట్ రోల్ చేశాను. చాలా మంచి కమర్షియల్ మూవీ ఇది. శాంతి చంద్ర గారు అన్ని ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటారు. సినిమా  పెద్ద హిట్ అవుతుంది అన్నారు.
 
హీరోయిన్ దీపిక సింగ్ మాట్లాడుతూ - డర్టీ ఫెలో సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చిన హీరో శాంతి చంద్రకు థ్యాంక్స్. ఈ సినిమా కోసం హార్ట్ అండ్ సోల్ పెట్టి పనిచేశాం. మా బెస్ట్ వర్క్ ఇచ్చాం. సినిమా మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నాం. ఈ నెల 24న థియేటర్స్ లో డర్టీ ఫెలో చూడండి. అన్నారు.
 
హీరోయిన్ సిమ్రితి బతీజా మాట్లాడుతూ - మా మూవీ ఈవెంట్ కు వచ్చిన వారందరికీ థ్యాంక్స్. తెలుగులో నేను నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ అవకాశం ఇచ్చిన శాంతి చంద్రకు థ్యాంక్స్. షూటింగ్ టైమ్ లో చాలా సపోర్ట్ చేశాడు. మీడియా సపోర్ట్ ఉంటే మా మూవీ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. డర్టీ ఫెలో సినిమా చూడండి. సినిమా మీకు నచ్చితే మాకు తెలియజేయండి. అన్నారు.
 
హీరోయిన్ నికిష రంగ్ మాట్లాడుతూ - తెలుగులో నేను నటిస్తున్న రెండో చిత్రమిది. గ్లామర్ తో పాటు పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ లో కనిపిస్తాను. డర్టీ ఫెలో మూవీ బాగుంటుంది. థియేటర్స్ లో తప్పకచూడండి. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments