దినేష్‌ తేజ్ నటించిన అలా నిన్ను చేరి స్పెషల్ పోస్టర్

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (17:10 IST)
Dinesh Tej
యంగ్ హీరోలు కొత్త కొత్త కథలు ఎంచుకుంటూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటున్నారు. ఈ క్రమంలోనే దినేష్ తేజ్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలా నిన్ను చేరి అంటూ ఇది వరకు దినేష్ తేజ్ సినిమా అప్డేట్లను సోషల్ మీడియాలో వదలగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు (మే 26) దినేష్ తేజ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
 
దినేష్ తేజ్ మంచి నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఇప్పుడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా అలా నిన్ను చేరి అనే సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రీకరించే సాంగ్‌లో ఈ స్టిల్ ఉంటుందని తెలుస్తోంది. ఈ లుక్‌లో దినేష్ తేజ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు.
 
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో  రాబోతోన్న ‘అలా నిన్ను చేరి’  సినిమాతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాలో దినేష్ తేజ్ సరసన హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమాకు సుభాష్‌ ఆనంద్ సంగీతం అందించగా.. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అన్ని పాటలు రాయడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.  
 
నటీనటులు: దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదర్ శంకర్ తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Caught on camera: గుండెపోటుతో ఏఎస్ఐ మృతి.. ఎస్కలేటర్‌పైకి అడుగుపెట్టేందుకు? (video)

అన్నమయ్య జిల్లాలో చెల్లెలిపై అన్న లైంగిక దాడి, మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక

ఏపీలో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్

ఏడేళ్ల సోదరుడి ముందే గంజాయి మత్తులో బాలికపై అత్యాచారం

మహిళలకు నెలసరి సెలవు మంజూరు - కర్నాటక మంత్రివర్గం నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments