Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్యన్ ఖాన్‌కు షాకిచ్చిన బాంబే హైకోర్టు : కొత్త షరతుతో చిక్కులు

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (15:12 IST)
బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. గతంలో బెయిల్ సందర్భంగా విధించిన షరతును తొలగించింది. కానీ, దాని స్థానంలో కొత్త షరతు విధించింది. 
 
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ పార్టీలో ఆర్యన్ ఖాన్ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన విషయం తెల్సిందే. ఈ కేసులో కొంతకాలం జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇందులో ప్రతి శుక్రవారం నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలని ఆదేశించింది. కానీ ఇపుడు ఆ బెయిల్ షరతును కొట్టివేసింది. అయితే, ప్రత్యేక దర్యాప్తు బృందానికి మాత్రం సహకరించాలని, విచారణకు అవసరమైనపుడు పిలిస్తే ఢిల్లీకి వెళ్ళాలనో కొత్త షరతు విధించింది. 
 
ప్రతి శుక్రవారం ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లాలన్న షరతును కొట్టివేయాలంటూ ఆర్యన్ ఖాన్ తరపున హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లే సమయంలో మీడియా తనను అనుసరిస్తుందని, ఆ సమయంలో పోలీసులను వెంటబెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు... పాత షరుతును కొట్టివేసి.. కొత్త షరతును విధించింది. పైగా, ఈ కేసు విచారణ ప్రస్తుతం ఢిల్లీలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతుందని, అందువల్ల ఇకపై ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లాల్సిన పనిలేదని కోర్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ద్వారంపూడిని టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్... అలవాట్లు మార్చుకోండి..

పోలవరం.. విభజన కంటే జగన్‌తో రాష్ట్రానికి ఎక్కువ నష్టం: చంద్రబాబు

ఒకే వేదికను పంచుకోనున్న టి.సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి

తిరిగేది పరదాల చాటున, అయినా 986 మంది సెక్యూరిటీయా? మాజీ సీఎం జగన్ పైన సీఎం చంద్రబాబు (video)

కొత్త ఈవీ బ్యాటరీని తయారు చేసిన తెలుగు వ్యక్తి, 5 నిమిషాల చార్జింగ్‌తో 193 కిలోమీటర్ల ప్రయాణం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

తర్వాతి కథనం
Show comments