Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిలీప్ అరెస్టుతో అందరిలాగానే నేను కూడా షాకయ్యా.. నేరం చేస్తే శిక్ష తప్పదు: భావన

కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ స్టార్ హీరో దిలీప్‌ అరెస్టుతో అందరిలాగానే తాను కూడా షాక్‌కు గురయ్యానని సినీ నటి భావన తెలిపింది. దిలీప్ పేరును ప్రస్తావించకుండా.. పోలీసులు అరెస్ట్ చేసిన హీరోతో తా

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (09:05 IST)
కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ స్టార్ హీరో దిలీప్‌ అరెస్టుతో అందరిలాగానే తాను కూడా షాక్‌కు గురయ్యానని సినీ నటి భావన తెలిపింది. దిలీప్ పేరును ప్రస్తావించకుండా.. పోలీసులు అరెస్ట్ చేసిన హీరోతో తాను పలు సినిమాల్లో పనిచేశానని గుర్తు చేసుకుంది. ఆయనతో తనకు ఎలాంటి రియల్‌ ఎస్టేట్‌, ఆర్థిక వ్యవహారాలు లేవని తెలిపింది. కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగానే తమ స్నేహబంధం ముగిసిపోయిందని చెప్పుకొచ్చింది. 
 
ఆయన నేరం చేసి వుండకపోతే నిజం తప్పకుండా బయటకొస్తుందని భావన తెలిపింది. అయితే ఈ కేసులో వాస్తవాలు త్వరగా బయటకు రావాలని, దోషులు తప్పించుకోకూడదని పేర్కొంది. అదే సమయంలో అమాయకులు శిక్షకు గురికాకూడదని చెప్పింది. ఫిబ్రవరిలో ఒక మలయాళ నటి లైంగిక దాడి జరిగిందని అనంతరం పోలీసులు ఆమె పేరును వెల్లడించలేదు. 
 
అయితే, ఆమె పేరును సోషల్‌ మీడియా ద్వారా నటుడు అజు వర్ఘీస్‌ ఉద్దేశపూర్వకంగా వెల్లడించాడు. దీంతో లైంగిక దాడి బాధితురాలి పేరును వెల్లడించిన నేరానికిగాను అతనిపై ఐపీసీ సెక్షన్‌ 228(ఏ) ప్రకారం కేసు నమోదు చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- అంతా భారత్ చేసిందా.. వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం